LIVE : తెలంగాణ భవన్​లో బీఆర్​ఎస్​ నేతల మీడియా సమావేశం - BRS leaders press meeT - BRS LEADERS PRESS MEET

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Jun 21, 2024, 2:10 PM IST

Updated : Jun 21, 2024, 2:44 PM IST

BRS Leaders Press Meet at Telangana Bhavan : పోచారం శ్రీనివాస్​రెడ్డి కాంగ్రెస్​ చేరిన వేళ హైదరాబాద్​లోని ఆయన నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది. పలువురు బీఆర్​ఎస్​ నేతలు, కార్యకర్తలు పోచారం నివాసం వద్దకు వెళ్లారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. వారిని బంజారాహిల్స్​ పోలీస్​ స్టేషన్​కు తరలించారు. దీనిపై హైదరాబాద్​లోని తెలంగాణ భవన్​లో బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే జగదీశ్​ రెడ్డి తీవ్రంగా స్పందించారు. పోచారం శ్రీనివాస్​ రెడ్డి కాంగ్రెస్​ చేరడంపై అసహనం వ్యక్తం చేశారు. పోచారం నివాసానికి ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి మరికొందరు కాంగ్రెస్​ నేతలు వెళ్లగా ఈ విషయం తెలుసుకుని బీఆర్​ఎస్​ కార్యకర్తలు అక్కడకు చేరుకున్నారు. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్​, గెల్లు శ్రీనివాస్​తో పాటు మరికొందరు పోచారం నివాసంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే వీరిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, బీఆర్​ఎస్​ నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది. ఇరువర్గాల మధ్య తోపులాట జరిగి ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.
Last Updated : Jun 21, 2024, 2:44 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.