LIVE : తెలంగాణ భవన్​లో కేటీఆర్​ మీడియా సమావేశం - KTR Press Meet at Telangana Bhavan

By ETV Bharat Telangana Team

Published : Jun 20, 2024, 4:04 PM IST

Updated : Jun 20, 2024, 4:59 PM IST

thumbnail

KTR Press Meet at Telangana Bhavan : నీట్​, నెట్​ తదితర పరీక్షలు నిర్వహిస్తున్న నేషనల్​ టెస్టింగ్​ ఏజెన్సీ అసమర్థతపై బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ విమర్శలు చేశారు. యూజీసీ నెట్​ పరీక్షలను ఎన్టీఏ రద్దు చేసిన నేపథ్యంలో ఎక్స్​ వేదికగా కూడా ఆయన స్పందించారు. నీట్ పరీక్షలో వైఫల్యాలను సమీక్షించి చర్యలు తీసుకోకముందే సమగ్రత విషయంలో రాజీపడరాదనే యూజీసీ నెట్​ పరీక్షను ఎన్టీఏ రద్దు చేసిందని తెలిపారు. 11 లక్షలకు పైగా అభ్యర్థులు నెట్​ పరీక్షకు హాజరయ్యారన్నారు. నీట్​ విషయంలో కూడా ఇలాంటి గందరగోళమే వ్యక్తమవుతుందని ఆయన ఆవేదన చెందారు. ఈ విషయాలపై కేంద్రమంత్రి వివరణ ఇవ్వాలని కేటీఆర్​ కోరారు. అయితే యూజీసీ-నీట్​పై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్నదని చెప్పారు. పలు హైకోర్టుల్లో నీట్​పై జరిగే విచారణలపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చిన విషయాలను ప్రస్తావించారు. ఈ క్రమంలో హైదరాబాద్​లోని తెలంగాణ భవన్​లో పార్టీ ముఖ్యనేతలతో కలిసి కేటీఆర్​ మీడియా సమావేశం నిర్వహిస్తున్నారు.

Last Updated : Jun 20, 2024, 4:59 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.