కాంగ్రెస్‌పై కోపంతో బీజేపీకు ఓటేస్తే పెనం నుంచి పొయ్యిలో పడ్డట్లే : హరీశ్‌రావు - Harish Rao Comments on Congress - HARISH RAO COMMENTS ON CONGRESS

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Apr 28, 2024, 9:00 PM IST

Harish Rao Comments on Congress Party : ధాన్యం కొనుగోళ్లలో తరుగు పెట్టిన కాంగ్రెస్‌ పార్టీకి ఓట్లలో తరుగు పెట్టాలని మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే హరీశ్‌రావు పిలుపునిచ్చారు. మెదక్‌ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన హరీశ్‌రావు, బీజేపీకు ఓటేస్తే పెనం మీది నుంచి పొయ్యిలో పడ్డట్లేనని హెచ్చరించారు. పదేళ్లుగా కేంద్రంలోని అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణకు ఏం చేసిందని ప్రశ్నించారు. కాంగ్రెస్​ నాయకులు ఉద్ధరిస్తారని ఓటేస్తే, ఉద్దెర మాటలు చెబుతున్నారని దుయ్యబట్టారు.

BRS Election Campaign in Medak : కేసీఆర్‌ బస్సుయాత్రతో కాంగ్రెస్‌ నేతలకు వణుకు పుట్టిందని, అందుకే ఆయనకు భయపడి సీఎం దేవుళ్లుపై ఒట్లు పెడుతున్నారని హరీశ్​రావు విమర్శించారు. రేవంత్‌రెడ్డి దిల్లీకి వెళ్లి మోదీతో ములాఖత్ అయ్యారని ఆరోపించారు. రూ.2 లక్షల రుణమాఫీ, 6 గ్యారంటీలు పూర్తి చేస్తే రాజీనామాకు సిద్ధమని పునరుద్ఘాటించారు. ఈ విషయమై అమరవీరుల స్థూపం వద్దకు రమ్మంటే రేవంత్ రాలేదని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌ పాలనలో కనీసం 14 గంటల కరెంట్‌ కూడా రావట్లేదని ధ్వజమెత్తారు. అబద్ధాలు చెప్పి గద్దెనెక్కిన రేవంత్‌రెడ్డికి పార్లమెంట్‌ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.