LIVE : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రెస్మీట్ - BRS Puvvada Ajay Kumar LIVE - BRS PUVVADA AJAY KUMAR LIVE
🎬 Watch Now: Feature Video
Published : Sep 4, 2024, 12:39 PM IST
|Updated : Sep 4, 2024, 1:11 PM IST
BRS Ex Minister Puvvada Ajay Kumar LIVE : వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీమంత్రి పువ్వాడ అజయ్ కుమార్ దుయ్యబట్టారు. వరద బాధితుల పరిస్థితులపై ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిన్న బీఆర్ఎస్ నాయకులపై దాడిచేయడం హేయనీయమైన చర్య అని దుయ్యబట్టారు. వరద బాధితుల గురించి ప్రశ్నించిన వారిపై ప్రభుత్వం దాడిచేయడం దారుణమన్నారు. నిన్న అసలేం జరిగిందంటే ఖమ్మం నగరం బొక్కలగడ్డలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ శ్రేణుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. వరద బాధితులను పరామర్శించేందుకు గులాబీ నేతలు మాజీ మంత్రులు హరీశ్ రావు, పువ్వాడ అజయ్, సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు వచ్చారు. వారి వెంటే బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఉన్నారు. అయితే కాంగ్రెస్ కార్యకర్తలు కూడా అక్కడే ఉండటంతో గులాబీ శ్రేణులను చూసి వారు నినాదాలు చేయడం మొదలుపెట్టారు. అలా ఇరు పార్టీల కార్యకర్తలు పరస్పర నినాదాలు చేస్తూ అది కాస్త గొడవకు దారి తీయడంతో రాళ్లు రువ్వుకున్నారు.
Last Updated : Sep 4, 2024, 1:11 PM IST