బీజేపీ కార్యాలయంలో ఉద్రిక్తత - బీబీ పాటిల్‌కు టికెట్ ఇవ్వొద్దంటూ నినాదాలు - Bibi Patel Join BJP
🎬 Watch Now: Feature Video


Published : Mar 2, 2024, 4:31 PM IST
BJP Workers Protest Against Bibi Patel Join : బీబీ పాటిల్‌ను బీజేపీలో చేర్చుకోవడం పట్ల జహీరాబాద్ బీజేపీ శ్రేణులు అసహనం వ్యక్తం చేశారు. ఆయనను చేర్చుకోవడాన్ని వ్యతిరేకిస్తూ జైపాల్ రెడ్డి అనుచరులు నిరసనలు చేపట్టారు. హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ముందు నిరసన తెలిపారు. జహీరాబాద్ టికెట్ జైపాల్ రెడ్డికి ఇస్తేనే గెలుస్తారని, అదే బీబీ పాటిల్ పదేళ్లలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
అదే జహీరాబాద్ టికెట్ ఆశిస్తున్న మాజీ మంత్రి బాగా రెడ్డి కుమారుడు జైపాల్ రెడ్డికి ఇస్తే ఈ స్థానంలో కచ్చితంగా గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. అంతేగానీ బీబీ పాటిల్‌కు టికెట్ ఇవ్వొద్దంటూ నినాదాలు చేశారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయని సభ్యుడు బీబీ పాటిల్ మాకొద్దంటూ ఫ్లకార్డులతో ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని కిషన్‌రెడ్డికి చెబితే ఎమ్మెల్యే కార్యాలయానికి వచ్చి కలవాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బీబీ పాటిల్ చేరికను ఒప్పుకునే పరిస్థితి లేదని బీజేపీ శ్రేణులు భీష్మించుకొని కూర్చుకున్నారు.