డీజీపీని కలిసిన బీజేపీ నేత రఘునందన్‌రావు - వెంకట్రామిరెడ్డిని అరెస్ట్ చేయాలని ఫిర్యాదు - BJP Raghunadan rao Meets DGP - BJP RAGHUNADAN RAO MEETS DGP
🎬 Watch Now: Feature Video
Published : May 18, 2024, 7:33 PM IST
BJP Raghunandan Rao Meets DGP : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డిని అరెస్ట్ చేయాలని డీజీపీకి ఫిర్యాదు చేసినట్లు మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు వెల్లడించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో వెంకట్రామిరెడ్డి పాత్ర ఉందని మాజీ డీసీపీ రాధాకిషన్ రావు స్టేట్మెంట్ ఇచ్చారని అసెంబ్లీ ఎన్నికల సమయంలో వెంకట్రామిరెడ్డికి సంబంధించిన రూ.3 కోట్లు తరలించినట్లు రాధాకిషన్ రావు స్టేట్మెంట్ ఇచ్చారన్నారు. అయినా వెంకట్రామిరెడ్డిపై ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని డీజీపీ రవిగుప్తాను కలిసి మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఫిర్యాదు చేశారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన రఘనందన్‌రావు, ఎందుకు వెంకట్రామిరెడ్డిని కాపాడుతున్నారని ప్రశ్నించారు. పొంగులేటి వియ్యంకుడని అని ఆయనను అరెస్ట్ చెయ్యడం లేదా? అనే విషయంపై ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీకి వ్యతిరేకంగా సాక్ష్యాలు ఉన్నా కూడా అరెస్ట్ చెయ్యడం లేదని అన్నారు. ఈరోజు ఈ కన్ఫెషన్ కాపీలన్నింటిని డీజీపీకి సమర్పించానని చెప్పారు. ఆధారాలున్నా ఎందుకు అరెస్టు చేయడం లేదని అడిగితే ఇప్పుడే ఈ విషయం తన దృష్టికి ఇప్పుడే వచ్చిందని కచ్చితంగా తగు చర్యలు తీసుకుంటామని డీజీపీ చెప్పారన్నారు.