LIVE : సరూర్నగర్ స్టేడియంలో బీజేపీ బహిరంగ సభ - BJP PUBLIC MEETING LIVE
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/07-12-2024/640-480-23064653-thumbnail-16x9-live-bjp.jpg)
![ETV Bharat Telangana Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg)
Published : Dec 7, 2024, 6:08 PM IST
|Updated : Dec 7, 2024, 7:16 PM IST
BJP Public Meeting Live : ఏడాది కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఆరు గ్యారంటీలు.. 66 మోసాల పేరుతో బీజేపీ బహిరంగ సభను నిర్వహిస్తోంది. ఈ బహిరంగసభ సరూర్ నగర్ స్టేడియంలో జరుగుతుంది. ఈ సభకు ముఖ్య అతిథిగా భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరయ్యారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలు, హామీలు అమలు చేయకపోవడం, ఏడాది పాలన వైఫల్యాలపై సభ ద్వారా ఎండగట్టనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. లోక్సభ ఎన్నికల తరవాత తొలిసారి రాష్ట్రానికి వస్తున్న జేపీ నడ్డాకు బీజేపీ శ్రేణులు స్వాగతం పలికారు. జాతీయ అధ్యక్షుడు సభకు వస్తుండటంతో పార్టీ రాష్ట్ర నాయకత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని పెద్ద ఎత్తునన జన సమీకరణను చేసింది. సభను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ పిలుపునిచ్చారు. సభ ఏర్పాట్లను ఎంపీలు ఈటల రాజేందర్, విశ్వేశ్వర్ రెడ్డి పరిశీలించారు.
Last Updated : Dec 7, 2024, 7:16 PM IST