హైడ్రా పేరుతో సీఎం రేవంత్ హైడ్రామా చేస్తున్నారు : ఏలేటి మహేశ్వర్‌రెడ్డి - BJP Alleti Maheshwar Reddy On Hydra - BJP ALLETI MAHESHWAR REDDY ON HYDRA
🎬 Watch Now: Feature Video
Published : Aug 25, 2024, 3:32 PM IST
BJP MLA Alleti Maheshwar Reddy On Hydra : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రా పేరుతో హైడ్రామా చేస్తున్నారని నిర్మల్ ఎమ్మెల్యే, బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర రెడ్డి ఆరోపించారు. సంగారెడ్డి కేంద్ర కార్యాలయంలో సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు పక్కన పెట్టి, హైడ్రా పేరుతో రేవంత్ రెడ్డి సంచలనం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. దానం నాగేందర్‌పై హైడ్రా కేసు నమోదు చేసినప్పుడు ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు.
ఎప్పుడు ఏదో ఒక సంచలనం చేయడమే రేవంత్ రెడ్డి పనని పేర్కొన్నారు. సీఎం తమ్ముడు, మంత్రి పొంగులేటి పైన కూడా అక్రమ నిర్మాణాల ఆరోపణలు ఉన్నాయని ఆరోపించారు. గత ప్రభుత్వం ఇచ్చిన పర్మిషన్తో కట్టుకుని నష్టపోయిన వారికి ఎలాంటి హామీ ఇస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ముందు తమ పార్టీ నేతల నుంచే కూల్చివేతలు మొదలు పెడితే మంచిదన్న ఏలేటి, సెలబ్రిటీల నిర్మాణాలు కూల్చివేసి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ధ్వజమెత్తారు.