LIVE : కిషన్ రెడ్డి మీడియా సమావేశం ప్రత్యక్ష ప్రసారం - BJP Leaders Press Meet Live - BJP LEADERS PRESS MEET LIVE
🎬 Watch Now: Feature Video


Published : Apr 14, 2024, 4:15 PM IST
|Updated : Apr 14, 2024, 5:04 PM IST
BJP Leaders Press Meet Live : బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ ముఖ్య నేతలు సమావేశమయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేసిన మేనిఫెస్టోపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. 2047 నాటికి వికసిత భారత్ థీమ్‌తో 14 అంశాలతో ఎన్నికల మేనిఫెస్టోను బీజేపీ రూపొందించిందన్న ఆయన, అది దేశాన్ని చాలా ముందుకు తీసుకువెళుతుందని అన్నారు. అభివృద్ధి, దేశ శ్రేయస్సు, యువత, మహిళలు, పేదలు, రైతులే ప్రధాన అజెండాగా సంకల్ప పత్ర రూపకల్పన చేశారని తెలిపారు. కాగా ఈసారి మేనిఫెస్టోలో మహిళలు, రైతులు, వృద్ధులకు పెద్ద పీట వేశారని చెప్పారు. ముఖ్యంగా జమిలి ఎన్నికలు, యూనిఫాం సివిల్ కోడ్ దేశానికి మంచి చేస్తాయని తెలిపారు. మరోవైపు ప్రధాని విడుదల చేసిన మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈసారి ఎన్నికల్లో బీజేపీ 400 సీట్లు గెలుస్తుందని అన్నారు.
Last Updated : Apr 14, 2024, 5:04 PM IST