LIVE : ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభుత్వ వైఖరిపై నిరసనగా బీజేపీ ధర్నా - BJP Dharna on Phone Tapping Case - BJP DHARNA ON PHONE TAPPING CASE
🎬 Watch Now: Feature Video
Published : May 31, 2024, 11:56 AM IST
|Updated : May 31, 2024, 12:58 PM IST
BJP Leaders Dharna on Phone Tapping Case : ఫోన్‌ట్యాఫింగ్ వ్యవహారంలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నేతలు నేడు ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద ఆందోళన నిర్వహిస్తున్నారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యులు, ఎంపీ లక్ష్మణ్ నేతృత్వంలో ఇవాళ ధర్నా మొదలైంది. ఈ ధర్నాలో కమలం పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు,రాష్ట్ర పదాధికారులు పాల్గొన్నారు. కేసీఆర్ ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని వాంగ్మూలం ఉన్నప్పటికీ, ప్రభుత్వం కీలక వ్యక్తులపై చర్యలు తీసుకోవడంలేదని బీజేపీ ఆరోపిస్తోంది. బీఎల్. సంతోష్‌ను లక్ష్యంగా చేసుకోవడంపై రాష్ట్రమంతా ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ఫోన్ ట్యాపింగ్‌తో భద్రతా నిబంధనలు ఉల్లంఘించిన గత కేసీఆర్ ప్రభుత్వం దేశ ద్రోహానికి పాల్పడిందని బీజేపీ నేత, ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు. దారుణమైన స్థితికి దిగజారి వ్యక్తిగత స్వేచ్ఛను హరించినవారిని ఉపేక్షించవద్దని అన్నారు. ఈ మేరకు ఇవాళ ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలని బీజేపీ నేతలు ధర్నాచౌక్ వేదికగా డిమాండ్ చేశారు.
Last Updated : May 31, 2024, 12:58 PM IST