LIVE : దిల్లీలో బండి సంజయ్​ మీడియా సమావేశం - ప్రత్యక్ష ప్రసారం - Bandi Sanjay Delhi Tour - BANDI SANJAY DELHI TOUR

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Jun 1, 2024, 3:08 PM IST

Updated : Jun 1, 2024, 3:22 PM IST

Bandi Sanjay Delhi Tour : బీజేపీ నేత బండి సంజయ్ దిల్లీ పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన కమలం పార్టీ నేతలను కలుసుకున్నారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై ఆయన పార్టీ అగ్రనేతలకు వివరించారు. అనంతరం దిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతున్నారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్, బీఆర్ఎస్​లపై విమర్శలు గుప్పించారు. ఎన్నికల సమయంలో హస్తం పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను మరిచిందని ఆయన విమర్శించారు. తమ మేనిఫెస్టో ఖురాన్​, బైబిల్​, భగవద్గీత అని కాంగ్రెస్​ నేతలు చెప్పారని మండిపడ్డారు. ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా నిర్వహించలేని ప్రభుత్వం, పంద్రాగస్టులోపు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామంటోందని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. ఫోన్ ట్యాపింగ్​పై సీబీఐ విచారణ జరిపించాలని సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశానన్నారు. కేసీఆర్, కేటీఆర్​లు ఫోన్​ ట్యాపింగ్ వ్యవహారాన్ని నడిపించారని ఆయన విమర్శించారు. ఆయన బీఆర్ఎస్​పై కూడా పలు విమర్శలు గుప్పించారు. దిల్లీ పర్యటనకు వెళ్లిన బండి సంజయ్​ మీడియా సమావేశంలో మాట్లాడుతున్నారు. 
Last Updated : Jun 1, 2024, 3:22 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.