బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి నాటకాలు ఆడుతున్నాయి : లక్ష్మణ్ - bjp laxman fires on congress - BJP LAXMAN FIRES ON CONGRESS
🎬 Watch Now: Feature Video
Published : Jun 6, 2024, 7:55 PM IST
BJP Laxman fires on Congress : బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి నాటకాలు ఆడుతున్నాయి బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్ మండిపడ్డారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారని, భద్రాద్రి కొత్తగూడెంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ కండువా వేసుకుని ప్రచారం చేశారని ఆయన దుయ్యబట్టారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజీనామా చేయకుండా కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసినా చర్యల్లేవని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో విత్తనాల కోసం రైతులు బారులు తీరారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎన్ని కుట్రలు పన్నినా ప్రజలు మోదీ ప్రభుత్వాన్ని గెలిపించారని స్పష్టం చేశారు.
ఉమ్మడి ఏపీలోనూ బీజేపీకి ఏనాడూ 8 ఎంపీ సీట్లు రాలేదని, రాష్ట్రాభివృద్ధి కోసం బీజేపీ ఎంపీలు కట్టుబడి ఉన్నారన్నారు. తెలంగాణలో ఒంటరిగా పోటీ చేసి బీజేపీ 35 శాతం ఓట్లు సాధించిందన్నారు. కాంగ్రెస్, కమ్యూనిస్టులు, మజ్లిస్ కలిస్తే కాంగ్రెస్‌కు 40 శాతం ఓట్లు వచ్చాయన్నారు. మెదక్, కరీంనగర్‌లోనూ బీఆర్ఎస్ మూడో స్థానానికి పడిపోయిందని, కేసీఆర్‌పై అక్కసుతోనే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌కు ఓటేశారన్నారు. కాంగ్రెస్ పరిస్థితి ఆడలేక మద్దెలఓడ అన్నట్లుందన్నారు. రాహుల్ నేతృత్వంలో కాంగ్రెస్ వరుసగా 3 సార్లు ఓడిపోయిందని, ఇండియా కూటమికి 233 సీట్లు వస్తే, బీజేపీకే 240 సీట్లు వచ్చాయన్నారు.