సమీక్ష చేసిన తర్వాతే తిరుమల లడ్డూపై సీఎం స్పందించారు: దగ్గుబాటి పురందేశ్వరి - purandeswari on CBN TTD COMMENTS
🎬 Watch Now: Feature Video
PURANDESWARI ON SUPREME COURT COMMENTS: శ్రీవారి లడ్డూ నెయ్యి కల్తీ విషయంలో సీఎం చంద్రబాబుకి మాట్లాడే హక్కు లేదని సుప్రీంకోర్టు చెప్పడం సరికాదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. తన రాష్ట్రంలో జరిగిన విషయానికి ఓ సీఎంగా ఆయన స్పందించారని అన్నారు. ఈ విషయంలో సిట్ నివేదిక వచ్చేదాకా ఆగుదామని చెప్పారు. తిరుమల లడ్డూ అంశంలో తనకు వచ్చిన సమాచారంతో సమీక్ష చేసిన తర్వాత చంద్రబాబు ప్రకటన చేశారని పేర్కొన్నారు. ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు ఎలా అమలవుతున్నాయనేది న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుంటుందన్నారు. తిరుమల లడ్డూ విషయంలో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యల గురించి మీడియా అడిగిన ప్రశ్నకు పురందేశ్వరి ఈ విధంగా స్పందించారు.
విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో వారధి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. తమకు వివిధ సమస్యలపై ప్రజల నుంచి విజ్ఞాపన పత్రాలు స్వీకరించి, వాటిపై సంబంధిత శాఖల అధికారులతో వెంటనే పోన్ చేసి మాట్లాడుతున్నామని చెప్పారు. భూ సమస్యలపై ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయని, వీటి వివరాలను ఆయా జిల్లాల కలెక్టర్లకు పంపిస్తున్నామన్నారు.