యువత స్వయం ఉపాధి దిశగా అడుగులు వేస్తా : బూర నర్సయ్య గౌడ్ - Lok Sabha Elections 2024

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Mar 18, 2024, 4:11 PM IST

BJP Candidate Bura Narsaiah Goud Interview : రాష్ట్ర  అభివృద్ధి ప్రధాని మోదీతోనే సాధ్యమని భువనగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్‌ అన్నారు. రాహుల్‌గాంధీ ప్రధాని అవుతారని కాంగ్రెస్‌ నేతలు పగటికలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. మరోసారి కేంద్రంలో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తాను ఎంపీగా ఉన్న సమయంలో రాష్ట్రానికి భారీగా నిధులు తీసుకొచ్చానని చెప్పారు. ఎంపీగా గెలుపొందితే చౌటుప్పల్​ వరకు మెట్రో తీసుకురాడానికి ప్రయత్నిస్తానని అన్నారు. 

అలాగే రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తే మునుగోడు రిజర్వాయర్​కు కేంద్రం నుంచి నిధులు తీసుకువస్తానని హామీ ఇచ్చారు. అదే విధంగా మునుగోడులో పరిశ్రమలు ఏర్పాటు చేస్తామన్నారు. యువతకు ఉపాధి కల్పించేలా తాను అడుగులు వేస్తానని వివరించారు. కేంద్ర పథకాల ద్వారా యువత నైపుణ్య కేంద్రాలు ఏర్పాటు చేసి వారి స్వయం ఉపాధి దిశగా పని చేస్తానని అన్నారు. భారీ మెజార్టీతో భువనగిరి కోటాపై కమలం జెండా ఎగరేస్తామని అంటున్న బూర నర్సయ్య గౌడ్‌తో  మా ప్రతినిధి ఈశ్వర్‌ ముఖాముఖి. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.