బ్రిడ్జి రేలింగ్‌ను ఢీకొట్టిన బస్సు- జహీరాబాద్‌లో పిరామల్ సంస్థ బస్సుకు తప్పిన పెను ప్రమాదం - Piramal Company bus in Zaheerabad - PIRAMAL COMPANY BUS IN ZAHEERABAD
🎬 Watch Now: Feature Video
Published : Sep 12, 2024, 4:35 PM IST
Bus hit the Railway Bridge Railing in Sangareddy: సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ ప్రాంతంలోని పిరామల్ పరిశ్రమకు చెందిన బస్సుకు పెను ప్రమాదం తప్పింది. రాంనగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్‌పై ఉన్న రేలింగ్ గోడను ఢీకొట్టి సగం వరకు బస్సు దూసుకెళ్లింది. వెనక టైర్లను ఫుట్‌పాత్ అడ్డుకోవడంతో బస్సు కింద పడకుండా ఆగిపోయింది. బస్సు ప్రమాదంతో జహీరాబాద్ నుంచి తాండూర్ వెళ్లే ప్రయాణికులకు రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. బ్రిడ్జిపై సగం వరకు వేలాడిన బస్సును ప్రయాణికులు చూసి విస్మయానికి గురయ్యారు.
ఆ సమయంలో బస్సులో ఎవరూ లేకపోవడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. రవాణా శాఖ అధికారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఎన్ని సార్లు చెబుతున్న వాహనదారులు పెడచెవిన పెడుతుండటంతో ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఈ ప్రమాదం కొద్ది సేపు స్థానికులను భయాందోళనకు గురి చేసింది. బస్సు ఒకవేళా కింద పడిపోయుంటే చాలా మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయేవని అంటున్నారు.