వరద ప్రభావిత ప్రాంతాల్లో భట్టి పర్యటన - పూర్తి నష్టాన్ని అంచనా వేయాలని అధికారులకు ఆదేశం - Bhatti Visits Khammam Flood Areas - BHATTI VISITS KHAMMAM FLOOD AREAS
🎬 Watch Now: Feature Video
Published : Sep 8, 2024, 2:26 PM IST
Bhatti Vikramarka Visits Khammam Affected Areas : భారీ వర్షాల నేపథ్యంలో ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పర్యటించారు. ముదిగొండ మండలం చిరుమర్రి గ్రామంలో ఇప్పటికే వరదలు వచ్చిన కారణంగా, పంట పొలాలకు వెళ్లి జరిగిన నష్టాన్ని అంచనా వేయాలని పరిశీలించాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. జరిగిన మొత్తం నష్టాన్ని పూర్తిగా అంచనా వేసి నివేదికలు సమర్పించాలని అధికారులను చెప్పినట్లు వివరించారు.
రూ.2 లక్షల రుణమాఫీ అందిరికి తప్పక చేస్తాం : అంతేకాకుండా సాంకేతిక ఇబ్బందులు, సమాచార లోపంతో ఎవరికైనా రెండు లక్షలలోపు రుణమాఫీ కానీ వారు సంబంధిత అధికారులను కలవాలని ఆయన సూచించారు. అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి రూ.2 లక్షల రుణమాఫీ చేయడం తమ ప్రభుత్వ లక్ష్యమని భట్టి మరోసారి పునరుద్ఘాటించారు. మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశమున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు ఆయన సూచించారు. అధికారులు వర్షాల పట్ట అప్రమత్తంగా ఉండి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు.