LIVE: బండి సంజయ్ ప్రజాహిత పాదయాత్ర - ప్రత్యక్షప్రసారం - Sanjay Prajahita Padayatra live

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Feb 10, 2024, 1:17 PM IST

Updated : Feb 10, 2024, 1:27 PM IST

Bandi Sanjay Live : త్వరలో లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌ ప్రజాహిత పాదయాత్రకు నేడు శ్రీకారం చుట్టారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్‌ పార్లమెంట్ పరిధిలోని ఏడు సెగ్మెంట్లలో పాదయాత్ర చేస్తున్నారు.. పాదయాత్రకు ముందు ఆయన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం మేడిపల్లి నుంచి యాత్ర ప్రారంభమైంది. వేములవాడ సెగ్మెంట్‌ పరిధిలోని మేడిపల్లి, బీమారం, కథలాపూర్‌ మండలాల్లో పర్యటిస్తున్నారు. తొలి విడతలో ఈ నెల 10 నుంచి 15 వరకు వేములవాడ, సిరిసిల్ల సెగ్మెంట్ల పరిధిలోని 88 గ్రామాల్లో 218 కి.మీ. మేర యాత్ర ఉంటుంది. ఈ నెల 20 నుంచి రెండో విడతలో చొప్పదండి, మానకొండూరు, హుజూరాబాద్‌, హుస్నాబాద్‌ సెగ్మెంట్లలో కొనసాగించి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్‌ మండలం సంకెపల్లిలో ముగింపు సభ నిర్వహించేలా బీజేపీ నేతలు రూట్ మ్యాప్‌ ఖరారు చేశారు. బండి సంజయ్ గ్రామాల్లో కాలినడకన, బయటకు వచ్చాక వాహనంలో యాత్ర కొనసాగించనున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు.

Last Updated : Feb 10, 2024, 1:27 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.