పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయండి : బండి సంజయ్ - రాజన్న సిరిసిల్లాలో బండి సంజయ్
🎬 Watch Now: Feature Video
Published : Feb 14, 2024, 12:06 PM IST
Bandi Sanjay Praja Hitha Yatra In Sircilla : ప్రజల సమస్యలపై తాము కోట్లాడితే కాంగ్రెస్కు ఎందుకు ఓటు వేశారని కరీంనగర్ ఎంపీ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ప్రజలను ప్రశ్నించారు. ప్రజల సమస్యలపై కొట్లాడిన తమపై కేసులు నమోదు చేసి జైల్లో పెట్టారని తెలిపారు. కేసీఆర్ పైన కోపం ఉంటే బీజేపీకి వేయాల్సిన ఓటును కాంగ్రెస్కు ఎందుకు వేశారని ప్రజలను అడిగారు. బండి సంజయ్ చేపట్టిన ప్రజాహిత యాత్ర కోనరావుపేట మండలంలో కొనసాగింది. తెలంగాణలో ప్రజల సమస్యలపై బీజేపీ కొట్లాడితే ప్రజలు కాంగ్రెస్కు ఎందుకు ఓటేశారన్న విషయం దేశం మొత్తం ఆలోచిస్తుందన్నారు. ప్రజల సమస్యల కోసం నిరంతరం బీజేపీ పోరాడుతుందని గుర్తు చేశారు.
Bandi Sanjay In Sircilla : తెలంగాణకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోట్లాది రూపాయలు నిధులు మంజూరు చేశారని సంజయ్ తెలిపారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో అటు ఇటు ఓటు వేయకుండా గంపగుత్తగా బీజేపీకి ఓటు వేయాలని అభ్యర్థించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పి మొండిచేయి చూపించిందన్నారు.