LIVE : అదిలాబాద్ విజయ సంకల్ప యాత్రలో బండి సంజయ్ - ప్రత్యక్ష ప్రసారం - Bandi Sanjay News
🎬 Watch Now: Feature Video


Published : Feb 21, 2024, 7:48 PM IST
|Updated : Feb 21, 2024, 8:48 PM IST
Bandi Sanjay Live : లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 370 సీట్లు సాధిస్తుందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఇటీవలే కేంద్రమంత్రి బీఎల్ వర్మతో కలిసి బీజేపీ విజయ సంకల్ప యాత్రను తాండూర్‌లో బండి సంజయ్ ప్రారంభించారు. రాష్ట్రంలో అన్ని స్థానాల్లో బీజేపీని గెలిపించాలని కోరారు. జమ్మూకశ్మీర్‌లో 370 ఆర్టికల్(Article 370) రద్దు చేసినందుకు 370 సీట్లు కమలం ఖాతాలో వేయాలని కోరారు. బీఆర్ఎస్తో బీజేపీ పొత్తు అని కొందరు ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేస్తూ, మీడియాను తప్పుదోవ పట్టిస్తున్నారని సంజయ్ ఆక్షేపించారు. గులాబీ పార్టీతో ఎప్పటికీ కమలం పొత్తు పెట్టుకోదని ఆయన స్పష్టం చేశారు. పార్లమెంటు ఎన్నికల దగ్గర పడుతున్న నేపథ్యంలో కేంద్రం అభివృద్ధి, సంక్షేమాలను ప్రజలకు తెలియజేసేందుకు బీజేపీ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా విజయ సంకల్ప యాత్రల పేరిట రథయాత్రలు చేపడుతోంది. 17 లోక్‌సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా కమలదళం ప్రజల వద్దకు వెళుతోంది. ఈ 17 పార్లమెంటు నియోజకవర్గాలను(Parliamentary Constituencies) ఐదు క్లస్టర్స్‌గా విభజించి, నేడు రెండు క్లస్టర్స్‌లో యాత్రను ప్రారంభించారు.