చంచల్‌గూడలో చిన్నారి కిడ్నాప్ - గంటల వ్యవధిలోనే రెస్క్యూ చేసిన పోలీసులు - హైదరాబాద్‌లో చిన్నారి కిడ్నాప్
🎬 Watch Now: Feature Video


Published : Mar 3, 2024, 12:15 PM IST
Baby Kidnapped in Chanchalguda : ఈమధ్య కాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో కిడ్నాప్ కేసులు ఎక్కువ అయిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలోనే తాజాగా హైదరాబాద్ చంచల్‌గూడలో 9 నెలల చిన్నారి కిడ్నాప్ కలకలం రేపింది. చంచల్గూడలోని నర్సింగ్ హోమ్‌లో 9 నెలల చిన్నారి అపహరణకు గురైంది. మాదన్నపేట్ పోలీస్ స్టేషన్లో బాధిత కుటుంబం ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీపుటేజీ ద్వారా జహీరాబాద్‌లో కిడ్నాపర్‌ను అదుపులోకి తీసుకొని పాపను తల్లిదండ్రులకు అప్పగించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం : ఛత్తీస్‌గఢ్‌కు చెందిన షెహనాజ్ అనే మహిళ చంచల్గూడలోని నర్సింగ్ హోంలో పనిచేస్తోంది. అక్కడ తొమ్మిది నెలల చిన్నారిని కిడ్నాప్ చేసి చంచల్‌గూడ నుంచి ఎంజీబీఎస్ వెళ్లి అక్కడి నుంచి బస్సులో జహీరాబాద్ వెళ్లింది. సీసీటీవీ కెమెరా దృశ్యాల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు జహీరాబాద్ పోలీసులకు సమాచారం అందించారు. అక్కడ ఆమెను అదుపులోకి తీసుకొని పాపను తల్లిదండ్రులకు అప్పగించారు. ఫిర్యాదు చేసిన గంటల వ్యవధిలోనే పాప కిడ్నాప్ కేసును పోలీసులు చేధించారు.