మ‌ల్లవ‌ల్లిలో యూనిట్​ ప్రారంభానికి సిద్దమవుతున్న అశోక్ లేలాండ్ - ఫలించిన ఎంపీ ప్రయత్నాలు - Ashokleyland respond to MP Chinni

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 2, 2024, 10:53 PM IST

Ashok Leyland Chairman Respond to MP Chinni Letter : గ‌త ప్రభుత్వ నిరంకుశ ప‌రిపాల‌నతో విసిగిపోయిన అశోక్ లేలాండ్ సంస్థ తిరిగి ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించాల‌ని కోరుతూ విజ‌య‌వాడ ఎంపీ కేశినేని శివ‌నాథ్ రాసిన లేఖకు అశోక్ లేలాండ్ కంపెనీ చైర్మన్ ధీర‌జ్ జి. హిందూజకి స్పందించారు. కృష్ణజిల్లా బాపులపాడు మండలంలోని మ‌ల్లవ‌ల్లిలో తయారీ ప్లాంట్​ను పునః ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామని బ‌దులిచ్చారు. అలాగే మ‌ల్లవ‌ల్లి ప్లాంట్ లో త‌మ‌ బస్సు బాడీ బిల్డింగ్ యూనిట్ త‌యారు చేయ‌డం ల‌క్ష్యమ‌ని తెలిపారు. ప్లాంట్ లో కార్యక‌ల‌పాలు మొద‌లుపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి స‌హ‌కారం అవ‌స‌రం అవుతుంద‌న్నారు. ఈ విష‌యంలో స‌హ‌క‌రించాల‌ని ఎంపీ కేశినేని శివ‌నాథ్​ను కోరారు.

 ఈ విష‌యం పై రాష్ట్ర ప‌రిశ్రమ‌ల శాఖ మంత్రి టి.జి.భ‌ర‌త్ తో సంస్థ మేనేజ్మెంట్ టీమ్ క‌లుస్తుంద‌ని తెలిపారు. ఆంధ్రప్రదేశ్​లో ప్లాంట్‌ను పునరుద్ధరించడానికి, ఆంధ్రప్రదేశ్ ప్రగతికి మద్దతు ఇవ్వడానికి ఆసక్తి గా వున్నట్లు అశోక్ లేలాండ్ కంపెనీ చైర్మన్ తెలిపారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కావ‌టంతో ఆంధ్రప్రదేశ్​ను పారిశ్రామికంగా అభివృద్ది చేసేందుకు కృషి చేస్తున్నారని కేశినేని చిన్నీ వివ‌రించారు. ప్లాంట్ ప్రారంభిస్తే దాదాపు 5 వేల మంది నిరుద్యోగులకి ఉద్యోగ అవ‌కాశం దొరుకుతుంద‌ని వివ‌రించారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.