రమాదేవి పబ్లిక్ స్కూల్​లో ఘనంగా ఆర్ట్ ఆఫ్ ఎక్స్​ప్రెషన్స్ ప్రదర్శన - Art of Expression in School

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Jan 25, 2024, 5:20 PM IST

​Art of Expression in Ramadevi Public School : రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్​మెట్​ పరిధిలోని రమాదేవి పబ్లిక్ స్కూల్​లో ఆర్ట్ ఆఫ్ ఎక్స్​ప్రెషన్స్ ఆకట్టుకుంటోంది. ఈ ప్రదర్శనలో సుమారు 300 మంది విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమనికి ముఖ్యఅతిథిగా ఈటీవీ భారత్ డైరెక్టర్ బృహతి హాజరై ప్రారంభించారు. అనంతరం విద్యార్థుల ప్రదర్శనను తిలకించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. విద్యార్థుల సృజనాత్మకతను వెలికి తీసి, వారి ప్రతిభను చాటడానికి కళా ప్రదర్శన ఒక చక్కటి వేదికని పేర్కొన్నారు.  

Art of Expression Students programme : విద్యార్థుల సమర్థత, నైపుణ్యం తెలియాలంటే కళా ప్రదర్ళనలు ముఖ్యమని బృహతి అన్నారు. అలాంటి కళా ప్రదర్శనలు రమాదేవి పబ్లిక్ స్కూల్‌లో ఏటా నిర్వహిస్తున్నందుకు అభినందనలు తెలిపారు. విద్యార్థుల ఆసక్తికి, అభిరుచికి ఈ ప్రదర్శనలతో మరింత తోడ్పాటు అందిస్తున్నారని ప్రశంసించారు. కార్యక్రమంలో రమాదేవి ట్రస్ట్ ట్రస్టీ రావి చంద్రశేఖర్, స్కూల్ ప్రిన్సిపల్ ఖమర్ సుల్తానా, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.