మెడికల్ సేల్స్ రిప్రజెంటేటివ్స్‌ని వేజ్ బోర్డులోకి తీసుకొచ్చి కనీస వేతనం చెల్లించాలి: ఏపీఎంఎస్​ఆర్​యూ

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 3, 2024, 8:48 PM IST

APMSRU Demands Lift GST on Medicines and Medical Devices : మందులు, వైద్య పరికరాలపై జీఎస్టీ ఎత్తివేయాలని ఏపీ మెడికల్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ (AP Medical Sales Representatives Union) నాయకులు డిమాండ్ చేశారు. మందుల ధరలు తగ్గించి నకిలీ, కల్తీ, నాసిరకం మందులకు అరికట్టాలని కోరారు. మెడికల్ సేల్స్ రిప్రజెంటేటివ్స్​ని వేజ్ బోర్డు పరిధిలోకి తీసుకొచ్చి కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆరోగ్య రంగానికి జీడీపీలో కనీసం 6 శాతం నిధులు కేటాయించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తమ డిమాండ్ల సాధన కోసం ఈ నెల 7వ తేదీన ఛలో విజయవాడ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మెడికల్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ నేతలు స్పష్టం చేశారు. విజయవాడ ధర్నా చౌక్​లో జరిగే ధర్నా కార్యక్రమానికి రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి వేలాది మంది మెడికల్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ వస్తారని ఆ సంఘం నాయకులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.