'సీఎం రేవంత్ చేస్తోంది కరెక్ట్' - పవన్ కల్యాణ్ నోట హైడ్రా మాట - PAWAN KALYAN ON TELANGANA HYDRA

By ETV Bharat Telangana Team

Published : Sep 4, 2024, 5:34 PM IST

thumbnail
'సీఎం రేవంత్ చేస్తోంది కరెక్ట్' - పవన్ కల్యాణ్ నోట హైడ్రా మాట (ETV Bharat)

Pawan Kalyan About Hydra : విపత్తు సమయంలో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బుడమేరులోని 90 శాతం ఆక్రమణలే విజయవాడకు శాపంగా మారాయని అన్నారు. ఆక్రమణలను అడ్డుకునేందుకు తెలంగాణలో హైడ్రా సమర్థంగా పని చేస్తోందని తెలిపారు. సీఎం రేవంత్ తీసుకున్న ఈ నిర్ణయం సరైందని పేర్కొన్నారు. చికిత్స కంటే నివారణ మేలు అన్నట్లు, ఎప్పుడైనా వరదలు వచ్చిన తర్వాత చర్యలు చేపట్టే బదులు రాకుండా ముందే చర్యలు తీసుకోవడం ఉత్తమమని తెలిపారు.

మరోవైపు ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల విజయవాడలోని సింగ్‌నగర్‌ ప్రాంతంలో ఇవాళ పర్యటించారు. ఈ సందర్భంగా వరద బాధితులను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ బుడమేరు రక్షణకు వెంటనే చర్యలు ప్రారంభించాలని ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణలో హైడ్రా మాదిరి బుడమేరు ఆక్రమణలు తొలగించాలని ఆమె ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.