LIVE : ఏపీ అసెంబ్లీ సమావేశాలు - ప్రత్యక్షప్రసారం - AP Assembly Sessions 2024 - AP ASSEMBLY SESSIONS 2024
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 23, 2024, 9:13 AM IST
|Updated : Jul 23, 2024, 3:27 PM IST
AP Assembly Sessions 2024 Live : రెండో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం నేడు అసెంబ్లీలో రెండు బిల్లులను ప్రవేశపెట్టనుంది. ల్యాoడ్ టైటిలింగ్ చట్టం రద్దుతో పాటు వైద్య ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్ పేరు పునరుద్ధరణ బిల్లులను ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాల తీర్మానంపై అసెంబ్లీలో చర్చిస్తున్నారు.సోమవారం నాడు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. విభజన వల్ల ఆంధ్రప్రదేశ్‌కు నష్టం ఏర్పడిందని, ఆంధ్రప్రదేశ్ సమ్మిళిత అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. చంద్రబాబు విజనరీ నాయకుడు అని, 2014లో ఏపీ అభివృద్ధికి ఆయన తీవ్రంగా కృషిచేశారని గవర్నర్ గుర్తు చేసుకున్నారు. 2014 నుంచి 2019 వరకు రాష్ట్రంలో పెట్టుబడుల వరద కొనసాగిందన్నారు. అనేక సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకొచ్చాయని, రాజధాని నిర్మాణానికి చంద్రబాబు ఎంతో కృషిచేశారని కొనియాడారు. 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో అన్ని రంగాలు నష్టాలు చవిచూశాయన్నారు. చంద్రబాబు హయాంలో వచ్చిన పెట్టుబడిదారులు వెనక్కి మళ్లారని తెలిపారు. 2019 నుంచి 2024 మధ్య కాలంలో రాష్ట్రం అప్పుల ఊబిలోకి వెళ్లిందని పేర్కొన్నారు.
Last Updated : Jul 23, 2024, 3:27 PM IST