రావి ఆకుపై కన్నయ్య చిత్రం వేసి - అందరి చేత ఔరా అనిపించి - LORD KRISHNA ART ON LEAF - LORD KRISHNA ART ON LEAF
🎬 Watch Now: Feature Video
Published : Aug 26, 2024, 12:12 PM IST
KRISHNA ART ON LEAF : నందగోపాలుడి పండుగ అంటే తెలుగు రాష్ట్రాల్లో గొప్పగా నిర్వహిస్తారు. భక్తి శ్రద్ధలతో ఉదయం పూజలు చేస్తారు. వారం రోజుల ముందే ఊరూవాడా ఏకమవడంతో పాటు ప్రభుత్వ, ప్రైవేట్ రంగ విద్యా సంస్థలు సైతం శ్రీ కృష్ణ జన్మాష్టమి పండుగను ఘనంగా జరుపుతారు. చిట్టిపొట్టి చిన్నారులంతా శ్రీకృష్ణడు, యశోదా వేషధారణలో ఉట్టికొడుతూ సందడి చేస్తుంటారు. తెలుగు సంస్కృతి సాంప్రదాయంలో అత్యంత ఆధ్యాత్మికంగా ఆనందంగా నిర్వహించే ఈ పండుగ నేడు ఘనంగా జరిగింది. అందులో భాగంగా నారాయణఖేడ్‌కు చెందిన ప్రముఖ ఆర్టిస్ట్ గుండు శివకుమార్ నెమలి పించంపై చిన్ని కృష్ణుడి చిత్రం, పచ్చని ఆకులపై వివిధ రూపాల్లో శ్రీ కృష్ణ పరమాత్ముడి చిత్రాలు వేసి అందరూ ఆశ్చర్యపోయేలా చేస్తున్నారు.
కృష్ణాష్టమి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం సోమవారం సెలవు ప్రకటించిన సంగతి తెలిసిందే. పండుగను పురస్కరించుకుని ప్రముఖ దేవాలయాలకు భక్తులు పోటెత్తారు. శ్రీకృష్ణ నామస్మరణతో ఆలయాలు హోరెత్తాయి. ఇస్కాన్ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి.