బీర్ల కోసం వైన్ షాప్ ముందు ధర్నా - సర్దిచెప్పేందుకు వచ్చిన పోలీసులపై మందు బాబుల దాడి - Alcohol Drinkers Attack on Police - ALCOHOL DRINKERS ATTACK ON POLICE
🎬 Watch Now: Feature Video
Published : Apr 29, 2024, 3:57 PM IST
Drinkers Attack on Police : వైన్ షాప్లో బీర్లు లేవన్నందుకు మద్యం ప్రియులు ఆందోళన చేపట్టారు. ఆపై వారికి సర్ది చెప్పడానికి వచ్చిన పోలీసులపై కూడా మద్యం మత్తులో చేయి చేసుకున్నారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని తొగుట మండలం మెట్టు శివారులో జరిగింది. ఓ వైన్ షాప్లో బీర్లు లేవని నిర్వాహకులు చెప్పడంతో మందు బాబులు వైన్స్ వద్ద ఆందోళనకు దిగారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని వారిని సముదాయించే ప్రయత్నం చేశారు.
మందు బాబులకు సర్ది చెప్పే క్రమంలో పోలీసులపై వారు ఏకంగా చేయి చేసుకున్నారు. ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ పోలీసులకే సవాల్ విసిరినంత పని చేశారు. సుమారు గంటసేపు వరకు మందు బాబులు పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఎన్నికల వేళ శాంతియుత వాతావరణానికి భంగం కలుగుతుందని మందు బాబులను ప్రత్యేక వాహనంలో స్టేషన్కు తరలించారు. అనంతరం కౌన్సెలింగ్ ఇచ్చి తిరిగి ఇంటికి పంపించారు.