'కావాలంటే నన్ను తుపాకులతో కాల్చండి - విద్యావ్యాప్తికి చేస్తున్న కృషికి మాత్రం అడ్డుపడకండి' - Akbaruddin Owaisi On HYDRA - AKBARUDDIN OWAISI ON HYDRA
🎬 Watch Now: Feature Video
Published : Aug 26, 2024, 9:26 PM IST
Akbaruddin Owaisi On HYDRA : 'కావాలంటే నన్ను తుపాకులతో కాల్చండి, కత్తులతో విచక్షణా రహితంగా దాడి చేయండి. కానీ నేను చేస్తున్న మంచి పనులను కుట్రలు పన్ని మాత్రం ఆపకండి' అని మజ్లిస్ శాసనసభా పక్ష నేత, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ భావోద్వేగపూరితమైన ప్రసంగం చేశారు.
'మీకు కనిపిస్తున్నది స్కూల్ బిల్డింగ్ కానీ అందులో పేదలు, తల్లిదండ్రులు లేని పిల్లలకు ఉచిత విద్య అందుతున్నది. ఇక్కడ కుట్రలు పన్ని మీరు విజయం పొందొచ్చు. కానీ అల్లా దగ్గర ఏం సమాధానం ఇస్తారు' అని అక్బరుద్దీన్ ఓవైసీ అన్నారు. హైదరాబాద్ పాతబస్తీ బండ్లగూడలోని ఫాతిమా ఓవైసీ కాలేజీని హైడ్రా కూల్చివేస్తుందన్న వార్తలపై ఆయన పైవిధంగా స్పందించారు. పేదల్లో విద్యావ్యాప్తికి తాను చేస్తున్న కృషికి అడ్డుపడకండని ఆయన కోరారు. ఇప్పుడు కూడా తాను పోరాడటం మరిచిపోలేదని అన్నారు. గత కొన్ని రోజులుగా హైడ్రా పలుచోట్ల అక్రమనిర్మాణాలను కూల్చివేస్తోంది. తాజాగా కూల్చివేతలకు సంబంధించి ప్రభుత్వానికి హైడ్రా నివేదిక కూడా సమర్పించింది.