నాంపల్లిలో అగ్నిప్రమాదం - ఫర్నీచర్ గోదాం దగ్ధం - fire accident in nampally - FIRE ACCIDENT IN NAMPALLY
🎬 Watch Now: Feature Video
Published : Jun 6, 2024, 7:21 PM IST
Fire Accident at Furniture Godown in Nampally : హైదరాబాద్ నాంపల్లిలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్థానిక పటేల్‌నగర్‌లోని ఓ ఫర్నీచర్ గిడ్డంగిలో మంటలు ఎగిసిపడ్డాయి. దట్టమైన పొగలు కమ్ముకోవడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ప్రమాదం గుర్తించిన వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం ఇచ్చారు. ఫైర్ సిబ్బంది శకటాలతో హుటాహుటిన తరలివచ్చి, మంటలను ఆర్పేశారు.
Fire Accident in Nampally Hyderabad : ఫర్నీచర్ షాపు కావడంతో మంటలు ఉవ్వెత్తున్న ఎగిసిపడ్డాయి. మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. ఎట్టకేలకు మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అగ్ని ప్రమాద కారణాలు ఇంకా తెలియలేదు. షార్ట్ సర్క్యూటే ప్రమాద ప్రమాదకారణంగా కావచ్చని అధికారులు భావిస్తున్నారు. ఫర్నీచర్ గోదాం జనావాసం మధ్యలో ఉండటంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. ముందుజాగ్రత్తగా అధికారులు గోదాం ఆనుకుని ఉన్న ఇళ్లలోని ప్రజలను ఖాళీ చేయించారు. ఈ ప్రమాదంలో ప్రాణాపాయం తప్పింది. అగ్నిప్రమాద కారణాలు, నష్టంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.