9సంవత్సరాల బాలికకు ఏడు ఇంజక్షన్లు - పాప మృతి! - ఆర్ఎంపీ డాక్టర్ వైద్యంతో బాలిక మృతి
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 24, 2024, 4:25 PM IST
9-years-old Girl Died Due to RMP doctor's wrong treatment In NTR District : ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో ఆర్ఎంపీ (RMP) వైద్యం వికటించి 9 సంవత్సరాల బాలిక ప్రాణాలు కోల్పోయింది. బాలిక దివ్య మృతదేహాన్ని చూస్తూ తల్లి రోదనలు మిన్నంటాయి. వైద్యం కోసం వస్తే పాపకు 7 ఇంజెక్షన్లు ఇచ్చి ప్రాణం తీసాడంటూ మృతురాలు దివ్య తల్లిదండ్రులు. క్లినిక్ ఎదుట బైఠాయించి పాప కుటుంబ సభ్యులు ఆందోళనకు (Protest) దిగారు. తమ చిన్నారి ప్రాణాలు తీసిన వైద్యునిపై చర్యలు తీసుకోవాలంటూ స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
Girl Died Due to RMP doctor treatment : బుదవాడ గ్రామానికి చెందిన చెందిన 9 సంవత్సరాల బాలికకు (Girl) ట్రాన్సిల్స్ తీపించటం కోసం మంగోల్ గ్రామంలోని ఆర్ఎంపీ వైద్యశాలకు తీసుకువెళ్లారు. ఉదయం 7 గంటలకు చికిత్స నిమిత్తం పాపకు ఏడు ఇంజక్షన్ చేయటంతో పాప మృతి చెందినట్లు బంధువులు తెలుపుతున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు (police) విచారణ చేపట్టారు.