నిజామాబాద్‌లో 7 ఏళ్ల బాలుడి కిడ్నాప్ కలకలం - సీసీ ఫుటేజీ వీడియో వైరల్ - నిజామాబాద్‌లో బాలుడి కిడ్నాప్ కేసు
🎬 Watch Now: Feature Video


Published : Feb 2, 2024, 10:36 AM IST
7 Years Boy Kidnap Case in Nizamabad : నిజామాబాద్ నగరంలో ఏడేళ్ల బాలుడి కిడ్నాప్ కలకలం రేపుతోంది. మాలపల్లికి చెందిన మహమ్మద్ సల్మాన్ అలియాస్ మినాజ్ అనే బాలుడు గత నెల 30న ఇంటి సమీపంలో ఆడుకునేందుకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. బాలుడి ఆచూకీ తెలియకపోగా అదృశ్యమైనట్లు కుటుంబీకులు గుర్తించారు. ఒకటో పట్టణ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
Nizamabad Boy Kidnap CCTV Video Viral : విచారణలో భాగంగా స్థానికంగా ఉన్న సీసీ టీవీ దృశ్యాలు(Boy Kidnap CCTV Video) పోలీసులు పరిశీలించారు. ఓ వ్యక్తి ద్విచక్ర వాహనంపై బాలుడిని తీసుకెళ్లినట్లు గుర్తించారు. కిడ్నాప్ చేసిన వ్యక్తి స్థానికంగా ఉండే సోహెల్ ఖాన్‌గా గుర్తించారు. విజయవాడ వైపు బాలుడిని తీసుకెళ్లినట్లు పొలీసులు అనుమానిస్తున్నారు. ఒకటో టౌన్ పోలీసులు కేసును మరింత వేగంగా దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీలో రికార్డు అయిన దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.