ఒకే తీగకు 500 పతంగులు ఎగరేసిన యువకుడు- భారత్​ టీ20 వరల్డ్​కప్​ గెలవడం కోసమేనట! - T20 World Cup 2024 - T20 WORLD CUP 2024

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telugu Team

Published : Jun 18, 2024, 1:08 PM IST

500 Kites Single String in Rajasthan : టీ 20 ప్రపంచ కప్ జరుగుతున్న వేళ టీమ్​ఇండియాకు మద్దతుగా ఓ వ్యక్తి 500 పతంగులను ఒకే తీగతో ఎగురవేశాడు. భారత్ ప్రపంచకప్​ గెలుస్తుంది అనే నినాదాల​తో గాలిపటాలను తయారు చేశాడు. అతడే రాజస్థాన్​ ఉదయ్​పుర్​ జిల్లాకు చెందిన అబ్దుల్ కాదిర్.  

నిర్జల ఏకాదశి సందర్భంగా రాజీవ్ గాంధీ పార్కు ఎదురుగా ఉన్న ఫతేసాగర్‌లో అబ్దుల్ కాదిర్ తన బృందంతో కలిసి ఈ ప్రత్యేక ప్రదర్శన చేశాడు. లవ్​ సింబల్, ఐ లవ్ ఉదయపూర్, కోబ్రా, పారాచూట్, లిఫ్టర్, ఆక్టోపస్, టైగర్, ఇలా రకరకాల ఆకృతులలో, వివిధ రంగుల్లో ఉన్న మొత్తం 500 పతంగులను తయారు చేసి ఎగురవేశాడు. ఒకే తీగకి వెయ్యి గాలిపటాలను సైతం ఎగురవేయటం అబ్దుల్ ఖాదిర్ ప్రత్యేకత. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా నిర్జల ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పతంగులు ఎగురవేశామని, అయితే ఈసారి టీ20 ప్రపంచకప్​లో టీమ్​ఇండియా మద్దుతుగా చేసినట్లు అబ్దుల్ కాదిర్​ పేర్కొన్నాడు. అందుకే 'భారత్ టీ20 గెలుస్తుంది' అన్న నినాదాలు గాలిపటాలపై రాశామన్నాడు. 500లకు పైగా గాలిపటాలు కలిసి ఆకాశంలో ఎగురుతున్న దృశ్యాన్ని చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు. ఈ అద్భుత దృశ్యాన్ని తమ కెమెరాలలో బంధించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.