టీటీడీ వార్షిక బడ్జెట్‌ ₹5,141 కోట్లు - ధర్మకర్తల మండలి నిర్ణయాలు వెల్లడించిన భూమన

🎬 Watch Now: Feature Video

thumbnail

2024-25 Annual Budget of TTD Released: తిరుమల తిరుపతి దేవస్థానం 2024-25 ఆర్థిక సంవత్సర వార్షిక బడ్జెట్‌ను ధర్మకర్త మండలి ఈరోజు విడుదల చేసింది. ₹5141.74 కోట్ల రూపాయల వ్యయంతో బడ్జెట్‌ అంచనా వేసినట్లు టీటీడీ ఛైర్మన్‌ భూమన కరుణాకర్​ రెడ్డి తెలిపారు. తిరుమలలో ధర్మకర్తల మండలి సమావేశం నిర్వహించిన అనంతరం మండలిలో తీసుకున్న పలు నిర్ణయాలను ఛైర్మన్ వివరించారు. తిరుమల అన్నమయ్య భవనంలో భూమన కరుణాకర్‌రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశానికి పలువురు సభ్యులు హాజరయ్యారు

TTD Chairman Bhumana Karunakar Reddy: ఆలయంలో వివిధ విభాగాల్లో 46 పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించామన్నారు. టీటీడీ అనుబంధ ఆలయాల్లో 287 వేదపారాయణదారులు, విలీనం చేసుకున్న ఆలయాల్లో 288 ఉద్యోగాల భర్తీకి అనుమతి కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాశామన్నారు. తిరుమల రథసప్తమి వేడుకలను ఘనంగా నిర్వహించే ఏర్పాట్లపై చర్చించి, ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ రాకముందే వార్షిక బడ్జెట్​పై తుది నిర్ణయం తీసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.