వైఎస్సార్సీపీ ఆగడాలు ఇక సాగవు: పీతల సుజాత - PEETHALA SUJATHA ABOUT FAKE POSTS
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/09-11-2024/640-480-22863390-thumbnail-16x9-ex-minister-peethala-sujatha-about-fake-posts.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 9, 2024, 8:14 PM IST
EX Minister Peethala Sujatha About YSRCP Fake Posts : వైఎస్సార్సీపీ పాలనలో మహిళల వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డ ముఠాని వదిలిపెట్టేదిలేదని టీడీపీ నేత మాజీమంత్రి పీతల సుజాత హెచ్చరించారు. వీరి వెనుక ఉన్న పెద్ద తిమింగలాలపై కూడా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ ఆగడాలు ఇక సాగవన్నారు. వైఎస్సార్సీపీ పాలనలో అనేక నేరాలు ఘోరాలు, అత్యాచారాలు జరిగాయని పీతల సుజాత ఆరోపించారు. మహిళలను వ్యక్తిత్వ హననం చేస్తూ అసభ్య పోస్టులు పెట్టిన, పెడుతున్న జగన్ ముఠాని వదిలిపెట్టేది లేదని ఆమె హెచ్చరించారు.
వైఎస్సార్సీపీ పాపాల పుట్ట బద్దలైందన్న ఆమె, ఒక్కొక్క పాము ఆ పుట్టలోంచి బయటికి వస్తున్నాయన్నారు. చిన్న చేపల వెనుక ఉన్న పెద్ద తిమింగలాలపై కూడా చర్యలు తీసుకుంటామని తెలిపారు. వర్రా రవీంద్ర రెడ్డి లాంటివారు ఇంకా చాలా మంది ఉన్నారని, రవీంద్ర రెడ్డి వెనుక ఎవరున్నారో తెలియాలని ఆమె డిమాండ్ చేశారు. వర్రా రవీంద్రరెడ్డికి జీతం ఎక్కడి నుంచి వచ్చేదో సమగ్ర వివరాలు సేకరిస్తామని, తప్పక విచారణ జరిపిస్తామన్నారు.