AP Assembly Sessions from February 24th: ఈ నెల 24వ తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నారు. 24న ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. ఈ నెల 28న 2025-26 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. 15 రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. మొదటి రోజు బీఏసీ తర్వాత సభ ఎన్ని రోజులు జరపాలి అనే అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు. అసెంబ్లీ సమావేశాలకు మంత్రులు పూర్తి స్థాయి సబ్జెక్టుతో హాజరు కావాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
20వ తేదీన మంత్రివర్గం సమావేశం: సచివాలయంలో ఈ నెల 20వ తేదీ ఉదయం 11 గంటలకు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ కానుంది. మంత్రి వర్గంలో చర్చించాల్సిన ప్రతిపాదనలను ఈ నెల 18వ తేదీ సాయంత్రంలోగా పంపాలని సీఎస్ కార్యాలయం అన్ని మంత్రిత్వ శాఖలకు ఆదేశాలు జారీ చేసింది.
పోటీ కోసమే ర్యాంకులు - ఎవరినీ తక్కువ చేయడానికి కాదు: సీఎం చంద్రబాబు
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలకు మేలు జరిగేలా కేబినెట్లో నిర్ణయాలు: మంత్రి పార్థసారథి