ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులపై అవగాహన సభ- ఎవరిని అడిగి పెట్టారంటూ రెచ్చిన వైసీపీ నేత
🎬 Watch Now: Feature Video
YCP Leader Disturb Awareness Conference On SC, ST Atrocities Cases : ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులపై విద్యార్థులకు, ప్రజలకు అవగాహన కల్పించేందుకు వచ్చిన అధికారులను అడ్డుకొని నానా హంగామా చేశాడో వైఎస్సార్సీపీ నేత. ఎవరిని అడిగి కార్యక్రమం ఏర్పాటు చేశారని అధికారులను దుర్భాషలాడుతూ సభలో గందరగోళం సృష్టించాడు. ఈ ఘటన నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం పొంగూరు గ్రామంలో జరిగింది. సీఐడీ డీఎస్పీ కోటారెడ్డి, రెవెన్యూ, మరియు పోలీసు అధికారులు కలిసి పొంగూరు గ్రామంలో SC, ST అట్రాసిటీ కేసులపై అవగాహన కార్యక్రమం చేపట్టారు.
సభ జరుగుతుండగానే వైఎస్సార్సీపీ నేత శ్రీనివాసరెడ్డి అక్కడి చేరుకొని ఎవరిని అడిగి సభ ఏర్పాటు చేశారంటూ గట్టిగట్టిగా అరుస్తూ హంగామ చేశాడు. కార్యక్రమాన్ని నిలిపివేయాలని అధికారుతో ఘర్షణపడ్డాడు. వెంటనే అక్కడే ఉన్న పోలీసులు ఆయన్ను నిలువరించే ప్రయత్నం చేసిన మాట వినలేదు. తిరిగి పోలీసులపైనే దుర్భాషలాడాడు. పోలీసులపై దాడికి యత్నించాడు. చివరకు సభ ప్రాంగణం నుంచి శ్రీనివాసరెడ్డిని పోలీసులు బయటకు తీసుకెళ్లారు. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు.