ETV Bharat / business

స్టాక్ మార్కెట్లో బాగా డబ్బులు సంపాదించాలా? వారెన్ బఫెట్ పాటించే ఈ స్ట్రాటజీ​ తెలుసుకోండి! - WARREN BUFFETT INVESTMENT STRATEGY

వారెన్ బఫెట్ చెప్పిన ఈ 5 టిప్స్‌​ పాటిస్తే చాలు - స్టాక్​ మార్కెట్లో లాభాలు గ్యారెంటీ!

Warren Buffett
Warren Buffett (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 9, 2024, 10:18 PM IST

Warren Buffett Investment Strategy : దిగ్గజ వ్యాపారవేత్త, బిలియనీర్ వారెన్ బఫెట్ అంటే తెలియనివారుండరు. ఆయనకు చెందిన బెర్క్‌షైర్‌ హాత్‌వే కంపెనీ మార్కెట్‌ విలువ ఇటీవలే ఒక ట్రిలియన్‌ డాలర్లను దాటేసింది. ఈ మార్క్‌ను దాటిన మొదటి నాన్-టెక్ యూఎస్ కంపెనీగా బెర్క్‌షైర్‌ హాత్‌వే నిలిచింది. దీనికి ప్రధాన కారణం వారెన్ బఫెట్ వ్యాపార సూత్రాలే. మరి ఆయనలా మీరు కూడా బాగా డబ్బు సంపాదించాలని అనుకుంటున్నారా? అయితే మరెందుకు ఆలస్యం. ఆయన చెప్పిన 5 మనీ లెసన్స్‌ గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం రండి.

1. దీర్ఘకాలిక పెట్టుబడులు : వారెన్ బఫెట్ ప్రకారం, ఆర్థిక స్థిరత్వం ఉన్న కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాలి. ఈ పెట్టుబడులను దీర్ఘకాలం పాటు కొనసాగించాలి. అప్పుడే మీరు మంచి లాభాలు సంపాదించగలుగుతారు.

2. స్కిల్స్‌ నేర్చుకోవాల్సిందే : స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్‌ చేయాలంటే చాలా నైపుణ్యం అవసరం. ఈ స్కిల్స్ నేర్చుకోవడానికి చాలా సమయం పడుతుంది. కనుక మీరు ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్న కంపెనీ ఫండమెంటల్స్‌ గురించి బాగా తెలుసుకోవాలి. భవిష్యత్‌లో మంచి వృద్ధి అవకాశాలు ఉన్న కంపెనీలో మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి. ఇలా సింపుల్‌గా ఇన్వెస్ట్‌మెంట్స్‌ ప్రారంభించాలి. కానీ చాలా మంది దీనిని సంక్లిష్టంగా మార్చుకుంటారు. ఏమాత్రం పరిశోధన చేయకుండా అధిక లాభాలు ఆశించి రిస్కీ ఇన్వెస్ట్‌మెంట్స్ చేస్తుంటారు. అయితే ఇలా చేయడం ఏమాత్రం మంచిది కాదని వారెన్ బఫెట్ సూచిస్తున్నారు.

3. మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోవాలి : ఏదైనా కంపెనీలో లేదా స్టాక్‌లో పెట్టుబడులు పెట్టే ముందు మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోవాలి. దాని ఫండమెంటల్స్, టెక్నికల్స్ గురించి తెలుసుకోవాలి. లాభనష్టాల గురించి కచ్చితంగా ఆలోచించాలి. అప్పుడే మీరు సరైన నిర్ణయం తీసుకోగలుగుతారు.

4. ఇతరుల మాటలు వినకండి : స్టాక్ మార్కెట్లో స్పెక్యులేషన్స్ బాగా జరుగుతుంటాయి. మార్కెట్లో చాలా రకాలైన వార్తలు వస్తుంటాయి. కానీ మీరు మాత్రం చాలా స్పష్టతతో ఉండాలి. మార్కెట్‌పై సరైన అవగాహన లేని వ్యక్తులు చెప్పే మాటలను పట్టించుకోకపోవడం మంచిది. కేవలం నిపుణుల అభిప్రాయాలను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలి. అయితే వాటిని కూడా గుడ్డిగా నమ్మకూడదు. మీ రీసెర్చ్‌ ద్వారా తెలుసుకున్న అంశాల ఆధారంగానే పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవాలి.

5. భావోద్వేగాలు నియంత్రించుకోవాలి : స్టాక్ మార్కెట్లో తీవ్రమైన ఒడుదొడుకులు ఉంటాయి. కనుక పెట్టుబడిదారులు భావోద్వేగాలను అదుపులో పెట్టుకోవాలి. అప్పుడే మీరు ఆర్థికంగా సురక్షితంగా ఉంటారు. ఇక్కడ పాటించాల్సిన ప్రధాన సూత్రం ఏమిటంటే, ఇతరలు అందరూ అత్యాశతో ఉన్న సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇతరులు జాగ్రత్తపడుతున్న సమయంలో మీరు అత్యాశతో ఉండాలి. దీనిని సింపుల్‌​గా చెప్పాలంటే, స్టాక్ మార్కెట్ మంచి లాభాల్లో ఉన్నప్పుడు తెలివైన ఇన్వెస్టర్ భయపడాలి. ఎందుకంటే ఆ దశ తర్వాత మార్కెట్ కరెక్షన్‌కు లోనయ్యే అవకాశం ఉంటుంది. మార్కెట్‌లో అందరూ షేర్లను అమ్ముతున్నప్పుడు, షేర్ల ధరలు తగ్గిపోతాయి. అప్పుడు తెలివైన పెట్టుబడిదారుడు తక్కువ ధరకే మంచి షేర్లను కొనుగోలు చేయాలి. దీని వల్ల భవిష్యత్‌లో మంచి లాభాలు సంపాదించడానికి వీలవుతుంది.

బాగా ధనవంతులు కావాలని ఆశపడుతున్నారా? ఈ 'సక్సెస్ ఫార్ములా' మీ కోసమే!

ముకేశ్ అంబానీ 'ఇన్వెస్ట్​మెంట్ ఫార్ములా' - తెలుసుకుంటే ధనవంతులు కావడం గ్యారెంటీ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.