ETV Bharat / state

రోడ్డు ప్రమాదాల సమయంలో పోలీసుల నిర్లక్ష్యం తగదు: పవన్​కల్యాణ్​

రోడ్డు ప్రమాదాల సమయంలో పోలీసుల తీరుపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సీరియస్ - పోలీసులు బాధ్యతగా పని చేయకపోతే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని వెల్లడి

pawan_kalyan
pawan_kalyan (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 9, 2024, 10:27 PM IST

Updated : Nov 9, 2024, 10:54 PM IST

Pawan Kalyan Serious about Police Negligence During Road Accidents: రోడ్డు ప్రమాదాలు జరిగిన సమయంలో బాధ్యతగా ప్రవర్తించాల్సిన పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హితవు పలికారు. పోలీసులు బాధ్యతగా పని చేయకపోతే వారు చేసిన తప్పులు కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తాయని అన్నారు. ఇటీవల కాకినాడ జిల్లా తుని సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందగా, ఈ వ్యవహారంలో పోలీసులు ప్రవర్తించిన తీరుపై పవన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రమాదం గురించి ఫిర్యాదు చేయడానికి వెళ్లిన బాధితుల తల్లిదండ్రుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు ఆ కుటుంబాలకు తీవ్ర మనస్తాపానికి గురి చేసిందని అన్నారు.

శనివారం మంగళగిరిలోని వారి క్యాంపు కార్యాలయంలో ఇటీవల తుని సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన భీమవరం ప్రాంతానికి చెందిన పోలిశెట్టి రేవంత్ శ్రీమురహరి, విజయవాడకు చెందిన నాదెండ్ల నిరంజన్​ల కుటుంబ సభ్యులకు పవన్ కల్యాణ్ ధైర్యం చెప్పారు. మృతుల కుటుంబాలకు తన ట్రస్ట్ తరఫునుంచి 2 లక్షల ఆర్ధిక సాయం అందించారు. పోలీసులు వ్యవహించిన తీరుపై బాధిత కుటుంబసభ్యులకు పవన్ క్షమాపణలు చెప్పారు. కనీసం సమాధానం చెప్పకపోగా పోలీసులు మాట్లాడిన తీరు బాగాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్​పై ఎందుకు కేసులు పెట్టలేదని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.

వాలంటీర్ల విషయంలో సమస్యంతా అదే! - క్లారిటీ ఇచ్చిన పవన్ కల్యాణ్​

DGP Dwarka Tirumala Rao met Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్​తో డీజీపీ ద్వారకా తిరుమలరావు భేటీ అయ్యారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన క్యాంపు కార్యాలయంలో (Janasena camp office) వీరిద్దరూ పలు విషయాలపై చర్చించుకున్నారు.రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న లైంగిక దాడి ఘటనలు, సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టుల వ్యవహారంపై ఇరువురు చర్చించుకున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న నేరాలు, సామాజిక మాధ్యమాల్లో పోస్టులు, అరెస్టుల వివరాలను డీజీపీని అడిగి తెలుసుకున్నారు. గతంలో సామాజిక మాధ్యమాల్లో వైసీపీ నేతల పోస్టులపై చర్యలు తీసుకోవడంలో పోలీసుల తీరుపై పవన్ కల్యాణ్ తప్పుబట్టారు. మహిళలపై నేరాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించారు.

రాష్ట్రానికి పెనుముప్పుగా మారిన డ్ర‌గ్స్ - అమిత్​ షాను ట్యాగ్ చేసిన పవన్ కల్యాణ్

సీఎం ఆఫీస్​లో మంత్రులు పవన్, అనిత భేటీ - ఇద్దరూ ఏం చర్చించారంటే!

Last Updated : Nov 9, 2024, 10:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.