Tri Fold Smartphone: ప్రస్తుతం మార్కెట్లో ఫోల్డబుల్ మొబైల్ ఫోన్స్‌కు మంచి క్రేజ్ ఉంది. దీంతో ఈ తరహా స్మార్ట్ఫోన్లపై అనేక సంస్థలు ఫోకస్ చేశాయి. కస్టమర్ల ఆసక్తి, అభిరుచికి అనుగుణంగా వీటిని రూపొందించి మార్కెట్లో రిలీజ్ చేసేందుకు సన్నద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తన ఫస్ట్ ట్రై ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను త్వరలోనే రిలీజ్ చేయనున్నట్లు హువావే ప్రకటించింది.
హువావే మేట్ ఎక్స్‌టీ (Huawei Mate XT) పేరుతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయనున్నట్లు కంపెనీ సీఈఓ రిచర్డ్‌యి తెలిపారు. అయితే ఈ విభాగంలో మొబైల్‌ను లాంచ్ చేయనున్నట్లు ఇప్పటికే టెక్నో సంస్థ కూడా ప్రకటించింది. అయితే దీన్ని ఎప్పుడు రిలీజ్ చేస్తుందనే వివరాలను మాత్రం ఇంకా వెల్లడించలేదు. దీంతో ప్రపంచంలోనే ఫస్ట్ ట్రై ఫోల్డబుల్ ఫోన్ లాంచ్ చేసిన కంపెనీగా హువావే అవతరించనుంది. ఈ నేపథ్యంలో దీని లాంచ్ ఎప్పుడు? ధర, ఫీచర్లుపై ఓ లుక్కేద్దామా?
హువావే ట్రై ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్ లాంఛ్ ఎప్పుడు?:
- హువావే సంస్థ తన మొదటి ట్రై ఫోల్డబుల్ ఫోన్‌కు తీసుకురానున్నట్లు ప్రకటించింది.
- హువావే మేట్ ఎక్స్‌టీ పేరిట దీన్ని లాంచ్ చేయనున్నారు.
- సెప్టెంబర్ 10న చైనా మార్కెట్‌లో ఆవిష్కరించనున్నట్లు హువావే స్పష్టం చేసింది.
Huawei Mate XT Features:
- రెండు ఇన్‌వర్డ్ స్క్రీన్స్
- ఒక అవుట్‌వర్డ్ స్క్రీన్ డ్యూయల్ హింజ్ మెకానిజమ్
- ధర: రూ.3,35,000తో మార్కెట్లోకి రిలీజ్ చేయనున్నట్లు మార్కెట్ వర్గాల అంచనా.
Huawei’s new phone! Ok, MateXT is like an art and looks sooooooo futuristic! #HuaweiLaunch #phone #Huawei #华为三折叠 pic.twitter.com/gJsoSdxKmk
— ChitChat China🇨🇳🇺🇸 (@ChitChatChina) September 4, 2024
మరి టెక్నో ట్రై ఫోల్డ్ మొబైల్ రిలీజ్ ఎప్పుడు?:
- టెక్నో సంస్థ తొలిసారిగా ఈ ట్రై ఫోల్డ్ కాన్సెప్ట్‌ను ఫిబ్రవరిలో మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2024 (MWC 2024)లో ప్రకటించింది.
- ఇటీవల IFA బెర్లిన్‌లో నిర్వహించిన ఇండస్ట్రియల్ ఈవెంట్లో దీని ఫస్ట్ లుక్‌ను కూడా రిలీజ్ చేసింది.
- అయితే మార్కెట్లో దీన్ని ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తుందనే విషయాన్ని ఇంకా వెల్లడించలేదు.
- వచ్చే ఏడాది ముగిసేలోగా టెక్నో ట్రై ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో అందుబాటులోకి రానుందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
- టెక్నో కంటే ముందే చైనాకి చెందిన హువావే ఈ తరహా స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసేందుకు తేదీని కూడా ఖరారు చేసింది.