Worlds First Commercial Space Station: అమెరికా కొత్త స్టార్టప్ స్పేస్ టెక్ కంపెనీ వాస్ట్.. ప్రపంచంలోని మొట్టమొదటి కమర్షియల్ అంతరిక్ష కేంద్రం 'హెవెన్-1' డిజైన్‌ను వెల్లడించింది. సంప్రదాయ అంతరిక్ష కేంద్రాలకు స్వస్తి పలికి భూమ్మీద ఉండే అత్యంత విలాసవంతమైన హోటల్ మాదిరిగా స్పేస్ స్టేషన్‌ను తీర్చిదిద్దనున్నట్లు తెలిపింది. ఈ మేరకు 'హెవెన్- 1' రూపకల్పనపై సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ X వేదికగా ఓ వీడియోను షేర్ చేసింది.
ఆ వీడియోలో 'హెవెన్-1'ని చెక్కతో అందంగా తీర్చిదిద్దిన ద్వారాలు, మృదువైన, మెత్తని తెల్లటి గోడలు, హై ఎండ్ హోటల్లో ఉండే సౌకర్యాలతో అత్యంత అధునాతనంగా రూపొందించారు. మొత్తానికి స్పేస్ కంపెనీ వాస్ట్.. అద్భుతమైన ఇంటీరియర్ డిజైన్‌తో వ్యోమగాములకు రిసార్ట్ లాంటి వాతావరణాన్ని అందించనుంది. ఇది అచ్చం భూమిపై ఉండే లగ్జరీ హోటల్ మాదిరి అనుభూతిని అందిస్తుంది.
— VAST (@vast) October 10, 2024
అంతేకాక 'హెవెన్-1'లో అత్యాధునిక జిమ్, అడ్వాన్సడ్ ఎంటర్టైన్మెంట్ అండ్ కమ్యూనికేషన్ సిస్టమ్‌తో కూడిన ప్రైవేట్ గదులు కూడా ఉన్నాయి. అద్భుతమైన ఇంటీరియర్ డిజైన్‌తో రూపొందిస్తున్న ఈ 'హెవెన్-1'లో నలుగురు వ్యోమగాములు సౌకర్యవంతమైన గదుల్లో ఉన్నట్లు హాయిగా ఉండగలరు. అలాగే మెరుగైన నిద్ర కోసం ప్రత్యేకంగా రూపొందించిన క్వీన్-సైజ్ బెడ్ వంటివి కూడా ఇందులో ఉన్నాయి. వీటితో పాటు గుండె, ఎముకల ఆరోగ్యం కోసం ఆన్‌బోర్డ్ ఫిట్‌నెస్ సిస్టమ్ వంటి అధునాత సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశారు.
Today, Vast unveiled the final design for Haven-1, the world’s first commercial space station, setting a new standard. Guided by visionary designer Peter Russell-Clarke and astronaut Andrew Feustel, we’re pushing the boundaries of life in space with human-first design led by… pic.twitter.com/xDdMzNFnuF
— VAST (@vast) October 10, 2024
స్పేస్ కంపెనీ వాస్ట్.. ఆగస్టు 2025లో ప్రయోగించనున్న స్పేస్ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్‌లో 'హెవెన్-1' అనే పేరుతో దీన్ని ఆవిష్కరించనుంది. అయితే 2026 నాటికి ఇందులోకి సందర్శకులను అనుమతించనున్నట్లు పరిశోధకులు వెల్లడించారు. సందర్శకులు సున్నా గురుత్వాకర్షణలో చూసేలా వీలు కల్పించనున్నట్లు తెలిపారు. ప్రపంచంలోనే ఈ తొలి కమర్షియల్ స్పేస్ స్టేషన్‌ను పీటర్ రస్సెల్ క్లార్ట్, వ్యోమగామి ఆండ్రూ ఫ్యూస్టెల్ రూపొందిస్తున్నారు. అచ్చం లగ్జరీయస్ హోటల్ మాదిరిగా డిజైన్ చేస్తున్న స్పేస్ స్టేషన్ హెవెన్-1కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.
చరిత్ర సృష్టించిన స్పేస్ఎక్స్- లాంచ్ ప్యాడ్ వద్దకే రాకెట్ బూస్టర్- వీడియో చూశారా?
అంతుచిక్కని రైలు ప్రమాదాలు- మానవ తప్పిదమా?- లేకుంటే టెక్నాలజీ లోపమా?