ETV Bharat / technology

డేటా బ్యాకప్​తో ఎన్నో లాభాలు- ఎప్పుడైనా ఎక్కడైనా ఈజీగా యాక్సెస్​- చోరీ అయినా సేఫే! - World Backup Day 2024 - WORLD BACKUP DAY 2024

World Backup Day 2024 : ప్రస్తుత డిజిటల్​ కాలంలో డేటాను ఆధారంగా చేసుకుని సైబర్​ మోసాలు విపరీతంగా పెరిగిపోయాయి. సైబరాసురులు డేటాను దుర్వినియోగం చేయడం వల్ల ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ఆర్థిక నష్టాలకు గురయ్యారు. అంతటి కీలకమైన డేటాను బ్యాకప్​ చేసుకుని, జాగ్రత్తగా కాపాడుకోవడం అత్యవసరం. మార్చి 31వ తేదీన 'వరల్డ్ బ్యాకప్​ డే' సందర్భంగా డేటా బ్యాకప్, డేట్ బ్రీచింగ్, క్లౌడ్​ బేస్డ్​ బ్యాకప్​ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

World Backup Day March 31, 2024
World Backup Day Significance
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 31, 2024, 5:02 AM IST

World Backup Day 2024 : ప్రస్తుత రోజుల్లో డేటా అనేది చాలా ముఖ్యం. సంపద సృష్టికి ప్రధాన ఇంధనంగా డేటా మారిపోయింది. వ్యాపార కార్యకలాపాలు సజావుగా సాగడానికి ఈ డేటా చాలా అవసరం. అందుకే సైబర్​ దాడుల ముప్పు నుంచి డేటాను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గణాంకాల ప్రకారం, 2023లో డేటా లీకేజ్​, డేటా కాంప్రమైజింగ్​ వల్ల ఒక్క యూఎస్​లోనే దాదాపు 353 మిలియన్ల మంది వ్యక్తులు తీవ్రమైన ఆర్థిక నష్టాలకు గురయ్యారు. మార్చి 31వ తేదీన 'వరల్డ్ బ్యాకప్​ డే' సందర్భంగా డేటా బ్యాకప్, డేట్ బ్రీచింగ్, క్లౌడ్​ బేస్డ్​ బ్యాకప్​గురించి పలు వివరాలు తెలుసుకుందాం.

డేటా అమ్ముకుంటున్నాయ్​!
ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద పెద్ద ఆస్పత్రులు డేటా ఉల్లంఘనలకు పాల్పడ్డాయి. దీనితో యూజర్లు, పేషెంట్లు భారీగా ఆర్థికంగా నష్టపోయారు. దీనితో నియంత్రణ సంస్థలు నిబంధనలు ఉల్లంఘించిన సంస్థలపై భారీ జరిమానాలు విధించాయి. చట్టపరమైన చర్యలు తీసుకున్నాయి. బాధితులకు పరిహారం అందించేలా చేశాయి. కానీ బడా కంపెనీలు ఇలా డేటా ఉల్లంఘనలకు పాల్పడుతుండడం తీవ్రమైన దిగ్భ్రాంతి కలిగించే విషయం.

డేటా బ్రీచింగ్​
వ్యక్తిగత లేదా బడా వ్యాపార సంస్థల డేటా బ్రీచ్​ అయితే అది తీవ్రమైన ఆర్థిక నష్టాలకు దారితీస్తుంది. ముఖ్యంగా వ్యాపారాలు దెబ్బతింటాయి. స్టాక్ మార్కెట్​లో సదరు కంపెనీల విలువలు భారీగా తగ్గిపోతాయి. చివరకు ఇది పెట్టుబడిదారులకు తీవ్రమైన నష్టాన్ని మిగుల్చుతుంది. పైగా మార్కెట్లు సంస్థల పలుకుబడి దెబ్బతింటుంది. పెద్దపెద్ద సంస్థలైతే వీటిని తట్టుకోగలుగుతాయి. కానీ సాధారణ, చిన్న వ్యాపారులు పూర్తిగా దెబ్బతింటారు. చివరకు తమ బిజినెస్​ను పూర్తిగా మూసుకోవాల్సి వస్తుంది. పలు గణాంకాల ప్రకారం, అమెరికాలో డేటా బ్రీచింగ్ వల్ల ఒక్క ఏడాదిలోనే దాదాపు 70 శాతం మంది చిన్నవ్యాపారులు తీవ్రమైన నష్టాలకు గురై పుర్తిగా వ్యాపారాన్ని మూసివేశారు.

ఆరోగ్య రంగం మరింత దారుణం
వైద్య, ఆరోగ్య రంగాలకు సంబంధించిన డేటా చాలా సున్నితమైనది. ఇక్కడ కనుక డేటా కాంప్రమైజ్ అయితే ప్రభుత్వ సేవలకు తీవ్రమైన అంతరాయం ఏర్పడుతుంది. ఫలితంగా రోగుల ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంటుంది. దీని వల్ల సదరు ఆస్పత్రులపై, ప్రభుత్వ సంస్థలపై ప్రజలు విశ్వాసం కోల్పోయే ప్రమాదం ఉంది.

వ్యక్తిగత డేటా భద్రత
వ్యాపార సంస్థల విషయంలోనే కాదు, వ్యక్తిగత డేటా కూడా చాలా విలువైనది. సైబర్ నేరగాళ్లు సాధారణ పౌరులను టార్గెట్ చేసుకుని వాళ్ల డేటాను కాజేస్తున్నారు. వారిని ఆర్థికంగా, మానసికంగా దోచుకుంటున్నారు. మరికొన్ని సందర్భాల్లో విలువైన డేటాను పౌరులు పోగొట్టుకుని, తరువాత దానిని తిరిగి రికవరీ చేసుకోలేక ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టాలంటే, డేటా బ్యాకప్​​ ఫెసిలిటీ తప్పనిసరి. అందుకే వీటన్నింటినీ ప్రజలకు, సంస్థలకు గుర్తు చేయడానికి ప్రత్యేకంగా మార్చి 31న 'వరల్డ్ బ్యాకప్​​ డే'ను నిర్వహిస్తున్నారు.

క్లౌడ్​ బేస్డ్​ బ్యాకప్​
సాధారణంగా మనం కంప్యూటర్​, ల్యాప్​టాప్​, ఫోన్​, పెన్​డ్రైవ్​ లాంటి పలు డివైజ్​ల్లో డేటాను సేవ్ చేసుకుంటాం. లేదా ఎక్స్​టర్నల్​ హార్డ్​ డ్రైవ్స్​లో ఫైల్స్​ను ఉంచుకుంటాం. ఇవి ఫిజికల్​గా మన దగ్గరే ఉంటాయి కనుక ఎలాంటి ఇబ్బంది రాదు. ఒకవేళ ఇవే పోతే, మన విలువైన డేటాను కోల్పోవాల్సి వస్తుంది. పెద్ద పెద్ద సంస్థల వద్ద భారీ డేటా ఉంటుంది. దీనిని హార్డ్​డ్రైవ్స్​లో సేవ్​ చేయడం కుదరని పని. అందుకే వీటన్నింటికీ పరిష్కారం క్లౌడ్​ బేస్డ్​ బ్యాకప్​ ఫెసిలిటీ అందుబాటులో ఉంది.

ఈ క్లౌడ్ బేస్డ్ బ్యాకప్​ వల్ల మీరు ఎంత పెద్ద డేటాను అయినా సురక్షితంగా ఉంచుకోవచ్చు. దానిని మీకు నచ్చినట్లు వినియోగించుకోవచ్చు. అవసరమైతే బ్యాకప్​ చేసుకోవచ్చు. మారుతున్న వ్యాపార అవసరాలకు అనుగుణంగా ఈ క్లౌడ్ బేస్డ్ బ్యాకప్​ ఫెసిలిటీని ఉపయోగించుకోవచ్చు.

క్లౌడ్​ బేస్డ్​ బ్యాకప్​ వల్ల కలిగే ప్రయోజనాలు

  • అన్​లిమిటెడ్ స్కేలబిలిటీ : మీరు ఎలాంటి అదనపు రుసుములు చెల్లించకుండా, ఎంత పెద్ద డేటా అయినా క్లౌడ్​లో సేవ్ చేసుకోవచ్చు.
  • ఎఫీషియెన్సీ : క్లౌడ్ బ్యాకప్ అనేది పూర్తి స్వయంచాలకంగా పనిచేస్తుంది. కనుక మాన్యువల్​గా పనిచేయాల్సిన అవసరం ఉండదు. బ్యాకప్​​ ఫ్రీక్వెన్సీని సెట్​ చేసుకోవడం ద్వారా, మీ డేటాను ఎల్లప్పుడూ సురక్షితంగా ఉంచుకోవచ్చు.
  • ఎక్కడి నుంచైనా యాక్సెస్ : క్లౌడ్​లో డేటా సేవ్ చేయడం వల్ల మీరు ఎక్కడి నుంచైనా డేటాను యాక్సెస్ చేయవచ్చు. అందువల్ల మీ టీమ్ ఎక్కడ ఉన్నా, సురక్షితంగా, హాయిగా పనిచేసుకోవచ్చు. మీ టీమ్ మెంబర్స్ మధ్య ఫైల్స్​ను షేర్ చేసుకోవచ్చు. ఎలాంటి ఇబ్బంది లేకుండా కమ్యునికేషన్స్ జరుపుకోవచ్చు.
  • సెక్యూరిటీ : పటిష్టమైన ఎన్​క్రిప్షన్​, భద్రతా ప్రోటోకాల్స్ ఉండడం వల్ల క్లౌడ్ బేస్డ్ బ్యాకప్​కు సెక్యూరిటీ పరంగా ఎలాంటి రిస్క్ ఉండదు. ముఖ్యంగా ప్రైవేట్ సర్వర్​లలోని సమాచారం దుర్వినియోగం కాకుండా భద్రంగా ఉంటుంది. మీ సిస్టమ్ వైఫల్యమైనా, డేటా నష్టపోయినా, దానిని క్లౌడ్ నుంచి సులువుగా బ్యాకప్ చేసుకోవడానికి వీలవుతుంది. అందువల్ల సైబర్ ఎటాక్​లు జరిగినా, కంపెనీల విలువైన డేటా పోకుండా సురక్షితంగా ఉంటుంది.

వ్యక్తిగతంగా మనకు కూడా ఈ క్లౌడ్ బేస్డ్ బ్యాకప్ ఎంతగానో ఉపయోగపడుతుంది. సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్న నేటి కాలంలో మన డేటాను సురక్షితంగా క్లౌడ్​లో సేవ్ చేసుకోవడం ఎంతైనా అవసరం. అప్పుడే మన డేటా చోరీకి గురైనా, లేదా హార్డ్ డ్రైవ్​ల్లోని సమాచారం డిలీట్ అయినా, దానిని సులువుగా రికవరీ చేసుకోగలం. మన డిజిటల్ అసెట్స్​ను కాపాడుకోగలం.

OpenAI న్యూ 'వాయిస్​ క్లోనింగ్​ టెక్నాలజీ' - రిలీజ్ చేస్తే రిస్కే! - OpenAI Voice Engine

నంబర్స్​ డిస్​కనెక్ట్​ అంటూ ఫేక్​ కాల్స్- పౌరులకు కేంద్రం వార్నింగ్​- అక్కడ రిపోర్ట్​ చేయాలని సూచన - Centre Issues Advisory Fraud Calls

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.