ETV Bharat / technology

వాట్సాప్​లో మరో అద్భుతం.. ఇకపై చాట్​ బాక్స్​లోనే ట్రాన్స్​లేషన్..! అదెలాగంటే? - WHATSAPP TRANSLATION FEATURE

త్వరలో వాట్సాప్​లో ట్రాన్స్​లేషన్ ఫీచర్- ఇది ఎలా పనిచేస్తుందంటే..?

Whatsapp
Whatsapp (Etv Bharat)
author img

By ETV Bharat Tech Team

Published : Dec 12, 2024, 7:27 PM IST

Whatsapp Translation Feature: ప్రముఖ ఇన్​స్టంట్ మెసెజింగ్ యాప్ వాట్సాప్​ మరో అద్భుతమైన ఫీచర్​ను తీసుకొచ్చే పనిలో పడింది. ఇప్పటికే తన వినియోగదారుల కోసం ఎన్నో ఫీచర్లను తీసుకొచ్చిన వాట్సాప్​ తాజాగా 'ట్రాన్స్​లేషన్ ఫీచర్'​ను తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ఫీచర్​ సాయంతో ఇతర భాషల్లో వచ్చే మెసెజ్​లను చాట్​ బాక్స్​లోనే మనకు కావాల్సిన భాషలో ట్రాన్స్​లేట్ చేసుకుని చదువుకోవచ్చు.

ప్రస్తుతం ఈ ఫీచర్‌ను ఆండ్రాయిడ్‌ బీటా వెర్షన్‌ 2.24.26.9లో పరీక్షిస్తున్నట్లు వాబీటా ఇన్ఫో వెల్లడించింది. చాట్స్‌తో పాటు, వాట్సప్‌ ఛానెల్‌లోనూ ఈ సదుపాయం రాబోతోంది. ఈ ఫీచర్ ముఖ్యంగా వేర్వేరు వాట్సాప్ గ్రూప్​లను ఉపయోగించే యూజర్లకు ఎక్కువగా ఉపయోగపడనున్నట్లు తెలుస్తోంది.

నిజానికి వేర్వేరు గ్రూపుల్లో ఉన్నవారికి ఎన్నో భాషల్లో మెసెజ్​లు వస్తూ ఉంటాయి. ఆ సమయంలో ఆ భాష రానివారు దాన్ని అర్థం చేసుకునేందుకు తెగ కష్టపడుతుంటారు. గ్రూప్​లో వచ్చిన ఆ మెసెజ్ టెక్ట్స్‌ను కాపీ చేసి, వేరే ట్రాన్సలేషన్‌ టూల్‌లో వేసి చదువుతూ ఉంటారు. తద్వారా ఆ విషయంపై అవగాహన వచ్చాక రిప్లయ్‌ ఇస్తుంటారు. ఇన్ని తంటాలు పడకుండా సులువుగా చాట్‌ను ట్రాన్స్‌లేట్‌ చేసుకునేందుకు వాట్సాప్‌ ఈ 'ట్రాన్స్​లేట్ ఫీచర్​'ను తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తోంది.

ఈ ఫీచర్​ పూర్తిగా మన వాట్సాప్​లోనే పనిచేయనున్నట్లు తెలుస్తోంది. వాట్సాప్​లో సెక్యూరిటీ కోసం ఉండే ఎండ్‌ టు ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ సైతం ఈ ట్రాన్స్​లేషన్​లో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇక సాధారణ ట్రాన్స్‌లేషన్‌ టూల్స్‌లా క్లౌడ్ సర్వీస్​కు పంపించాల్సిన అవసరం లేకుండా నేరుగా ట్రాన్స్​లేషన్ చేసుకునే అవకాశం ఉంటున్నట్లు సమాచారం. ఫ్రీ డౌన్​లోడెడ్‌ లాంగ్వేజీ ప్యాక్స్‌ ఆధారంగా ఈ ట్రాన్స్​లేషన్ ఫీచర్‌ పనిచేస్తుంది. దీంతో ఈ ఫీచర్​ సహాయంతో ఇకపై థర్డ్‌ పార్టీ సర్వర్లకు గానీ, వాట్సప్‌ సర్వర్లకు గానీ డేటాను షేర్‌ చేయాల్సిన అవసరం ఉండదు.

అంతేకాక ఈ ఫీచర్​ను ఆఫ్​లైన్​లో ఉన్నప్పుడు సైతం వినియోగించుకోవచ్చని వాబీటా ఇన్ఫో వెల్లడించింది. అయితే ప్రతీ మెసెజ్​ను ట్రాన్స్​లేట్ చేయాలా? లేదా సెలెక్ట్ చేసుకున్న వాటిని మాత్రమే ట్రాన్స్​లేట్ చేయాలా? అనే ఆప్షన్ కనిపించనున్నట్లు తెలుస్తోంది. వీటిలో మనం ఎంచుకున్న ఆప్షన్​ను బట్టి మనకు కావాల్సిన మెసెజ్​లను ఈ ఫీచర్ ట్రాన్స్​లేట్ చేసి అందిస్తుంది.

అందుబాటులోకి ఎప్పుడు?:

  • ప్రస్తుతం ఈ ఫీచర్ డెవలప్మెంట్ స్టేజ్​లో ఉంది. దీన్ని బీటా టెస్టర్లు మాత్రమే ప్రయత్నించి దానిపై ఫీడ్ బ్యాక్​ను అందించగలరు.
  • ఇప్పటికైతే భారతదేశంలో ఎన్నో లాంగ్వేజెస్ ఉండటంతో ఈ ఫీచర్ ఏ ఏ భాషల్లో అందుబాటులోకి రాబోతుందనే విషయాన్ని వాబిటా ఇన్ఫో వెల్లడించలేదు.
  • వాట్సాప్​ త్వరలోనే ఈ ఫీచర్​పై మరింత సమాచారాన్ని అందించనున్నట్లు తెలుస్తోంది.

స్టన్నింగ్ లుక్.. దిమ్మతిరికే ఫీచర్లు- టయోటా కొత్త ప్రీమియం సెడాన్ చూశారా?

యూట్యూబ్​లో సరికొత్త ఫీచర్​- కంటెంట్ ఖండాలు దాటేలా.. వారిపై ఇక కాసుల వర్షమే!

జియో న్యూఇయర్ వెల్​కమ్ ఆఫర్- కొత్త రీఛార్జ్​ ప్లాన్​.. ఖర్చు కంటే ఎక్కువ బెనిఫిట్స్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.