ETV Bharat / technology

కొత్త బైక్ కొంటున్నారా? టీవీఎస్ రైడర్ iGo చూశారా? ఫీచర్లు అదుర్స్, ధర ఎంతంటే? - TVS RAIDER IGO VARIANT LAUNCHED

దీపావళి వేళ మార్కెట్లోకి కొత్త బైక్- iGo అసిస్ట్ టెక్నాలజీతో TVS రైడర్ లాంచ్

TVS Raider iGo Variant Launched
TVS Raider iGo Variant Launched (TVS Motor Company)
author img

By ETV Bharat Tech Team

Published : Oct 25, 2024, 4:43 PM IST

TVS Raider iGo Variant Launched: దీపావళి వేళ మార్కెట్లోకి సరికొత్త బైక్ వచ్చింది. దేశీయ బైక్ తయారీ సంస్థ టీవీఎస్‌ మోటార్‌ తన స్పోర్టీ కమ్యూటర్ మోటార్‌సైకిల్ రైడర్ 125లో కొత్త వేరియంట్‌ను రిలీజ్ చేసింది. కంపెనీ దీన్ని TVS రైడర్ iGo పేరుతో ఈ వేరియంట్​ను తీసుకొచ్చింది. ఇది కంపెనీ iGo అసిస్ట్ టెక్నాలజీతో వస్తుంది.

కంపెనీ ఇటీవల ప్రారంభించిన TVS జూపిటర్‌తో ఈ iGo అసిస్ట్ టెక్నాలజీని కూడా పరిచయం చేసింది. ఇది TVS రైడర్ ఆరో వేరియంట్. రైడర్ 10 లక్షల యూనిట్ల సేల్స్ మైలురాయిని చేరుకోవడాన్ని పురస్కరించుకుని రైడర్ iGoని తీసుకొచ్చారు. ఈ సందర్భంగా TVS రైడర్ iGo ధర, ఫీచర్లపై మరిన్ని వివరాలు తెలుసుకుందాం రండి.

  • కలర్ ఆప్షన్స్: రైడర్​ ఈ వేరియంట్ కొత్త నార్డో గ్రే కలర్ ఆప్షన్​లో మాత్రమే వస్తుంది. ఇది లైట్ గ్రే, బ్లాక్ కలర్స్ మిక్సింగ్ కలర్. ఈ బైక్​లో రెడ్ కలర్ అల్లాయ్ వీల్ అమర్చారు. ఈ మోటార్​సైకిల్ TVS SmartXonnectతో కూడిన LCD డిజిటల్ క్లస్టర్‌తో వస్తుంది.
  • కనెక్టింగ్ ఫీచర్స్: ఈ బైక్ వాయిస్ అసిస్ట్, టర్న్-బై-టర్న్ నావిగేషన్‌తో సహా 85కి పైగా కనెక్టింగ్ ఫీచర్లకు సపోర్ట్ చేస్తుంది.
TVS Raider iGo Variant
TVS Raider iGo Variant (TVS Motor Company)
  • పవర్‌ట్రెయిన్: ఈ వేరియంట్‌లో అతిపెద్ద మార్పు ఏంటంటే రైడర్ 124.8cc, 3-వాల్వ్ ఇంజిన్ ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ స్టార్ట్ జనరేటర్ (ISG)తో వస్తుంది. ఇది పవర్ మోడ్‌లో అడిషనల్ బూస్ట్‌ను అందిస్తుంది. ఈ ఇంజన్ సాధారణంగా 11.22bhp పవర్, 11.3Nm టార్క్ ఇస్తుంది. కానీ పవర్ మోడ్‌లో మొత్తం టార్క్ 11.75Nm వరకు పెరుగుతుంది. దీని ఇంజిన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఇతర వేరియంట్స్ కంటే రైడర్ iGo 10 శాతం ఎక్కువ ఫ్యూయెల్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని కంపెనీ చెబుతోంది.
  • మెకానికల్ ఫీచర్స్: ఇది దాని పాత మోడల్​లా ముందు వైపున టెలిస్కోపిక్ ఫోర్క్ సెటప్, వెనుకవైపు మోనోషాక్​ను కలిగి ఉంది. బ్రేకింగ్ కోసం దీని ముందు భాగంలో డిస్క్ బ్రేక్, వెనుక భాగంలో డ్రమ్ బ్రేక్ అమర్చారు. ఈ బైక్ 17 అంగుళాల చక్రాలపై నడుస్తుంది.
  • మార్కెట్లో దీనికి పోటీ: ఇండియన్ మార్కెట్లో ఈ కొత్త TVS రైడర్ iGo బైక్.. హీరో ఎక్స్‌ట్రీమ్ 125 R, హోండా SP125, బజాజ్ పల్సర్ N125 లతో పోటీ పడుతుంది.
  • ధర: ఇండియన్ మార్కెట్లో ఈ బైక్ రూ. 98,389 (ఎక్స్-షోరూమ్) ధరకు రిలీజ్ అయింది.

యాపిల్ కొత్త ప్రొడక్ట్స్​పై అప్డేట్ వచ్చేసిందోచ్..!- రిలీజ్ ఎప్పుడంటే?

కొంగొత్త ఫీచర్లతో కాన్వా డ్రీమ్​ ల్యాబ్- ఇకపై హై క్వాలిటీ ఇమేజెస్​తో పండగే..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.