ETV Bharat / technology

'అలాంటి యూజర్ల వివరాలు ప్రభుత్వానికి ఇస్తాం'- టెలిగ్రామ్ సీఈఓ వార్నింగ్! - Telegram CEO Latest News

author img

By ETV Bharat Telugu Team

Published : 2 hours ago

Telegram CEO Latest News : టెలిగ్రామ్​లో చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే యూజర్ల వివరాలు ప్రభుత్వానికి అందించనున్నట్లు ఆ సంస్థ సీఈఓ పావెల్ దురోవ్ తెలిపారు. యాప్​లోని సమస్యాత్మక కంటెంట్​ను తొలగించేందుకు సన్నద్ధమవుతున్నట్లు వెల్లడించారు.

Telegram CEO Pavel Durov
Pavel Durov (AP)

Telegram CEO Latest News : ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ టెలిగ్రామ్‌ వ్యవస్థాపకుడు, సీఈఓ పావెల్‌ దురోవ్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. టెలిగ్రామ్​లో నిబంధనల్ని మరింత కఠినంగా మార్చేందుకు నడుం బిగించారు. టెలిగ్రామ్‌లో సమస్యాత్మక కంటెంట్​ను తొలగించేందుకు సన్నద్ధమవుతున్నట్లు ప్రకటించారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే యూజర్ల వివరాలు ప్రభుత్వానికి అందించనున్నట్లు వెల్లడించారు.

ఏఐ సాయంతో సమస్యాత్మక కంటెంట్ గుర్తింపు
‘సమస్యాత్మక కంటెంట్‌’ను తొలగించడానికి, తమ సిబ్బంది కృత్రిమ మేధస్సును వినియోగిస్తున్నారని టెలిగ్రామ్ సీఈఓ పావెల్‌ దురోవ్‌ తెలిపారు. స్నేహితులకు మెసేజ్​లు పంపడం, వార్తా ఛానెల్స్​ను అనుసరించడం వంటి ప్రయోజనాల కోసం టెలిగ్రామ్‌ను తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. చట్టవిరుద్ధమైన కార్యకలాపాలను ప్రోత్సహించేందుకు కాదని స్పష్టం చేశారు.

'అలాంటి వారి వివరాలు ప్రభుత్వానికి అందిస్తాం'
ఒకవేళ ఎవరైనా టెలిగ్రామ్​లో సమస్యాత్మక కంటెంట్‌ యాక్సెస్‌ చేయడం లేదా షేర్‌ చేయడం లాంటివి చేస్తే అటువంటి వ్యక్తుల ఫోన్‌ నంబర్లు, ఐపీ అడ్రస్‌లను సంబంధిత అధికారులకు అందజేయనున్నట్లు దురోవ్‌ తెలిపారు. ఇకపై యాప్‌లో డ్రగ్స్‌, స్కామ్‌లు, పిల్లల దుర్వినియోగ చిత్రాలు వంటి సమస్యాత్మక కంటెంట్‌ను కనుగొనడం కోసం కృత్రిమ మేధస్సుని ఉపయోగిస్తున్నట్లు తెలిపారు.

ఆ ఆరోపణలపై అరెస్టు
కాగా, యాప్‌ దుర్వినియగాన్ని అడ్డుకోవడంలో టెలిగ్రామ్ సీఈఓ పావెల్‌ దురోవ్‌ విఫలమయ్యారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో ఈ ఏడాది ఆగస్టులో దురోవ్‌ను పారిస్‌ విమానాశ్రయంలో పోలీసులు అరెస్టు చేశారు. టెలిగ్రామ్‌ ద్వారా హవాలా మోసం, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, పిల్లలపై లైంగిక దోపిడీకి సంబంధించిన సమాచారం షేర్‌ చేయడం వంటి ఆరోపణలు ఆయనపై ఉన్నాయి.

వ్యక్తిగత జీవితం
రష్యాలో జన్మించిన దురోవ్‌ ప్రస్తుతం దుబాయ్‌లో నివసిస్తున్నారు. VKontakte యాప్​న​కు సంబంధించి వినియోగదారుల డేటాను రష్యా భద్రతా అధికారులతో పంచుకోవడానికి నిరాకరించారు దురోవ్. దీంతో రష్యా ప్రభుత్వంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత టెలిగ్రామ్​ను అడ్డుకునేందుకు రష్యా ప్రభుత్వం విఫలయత్నం చేసింది. దీంతో దురోవ్ 2014లో రష్యాను విడిచిపెట్టారు. ఆ తర్వాత 2021 ఆగస్టులో ఫ్రెంచ్‌ పౌరసత్వాన్ని తీసుకున్నారు. ప్రస్తుతం టెలిగ్రామ్‌ యాప్‌ను ప్రపంచవ్యాప్తంగా సుమారు 90 కోట్ల మంది వాడుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.