Nitin Gadkari Announces Discount on Vehicles: కొత్తకారు, కమర్షియల్ వెహికల్స్ కొనాలని అనుకునేవారికి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. పాత వాహనాల్ని తుక్కు కింద ఇచ్చేస్తే, కొత్త వాహనాలపై డిస్కౌంట్ ఆఫర్‌ను కల్పించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు వాలిడ్ డిపాజిట్ స్క్రాప్ సర్టిఫికేట్ తీసుకొచ్చినవారు కొత్త వాహనాలపై 1.5 నుంచి 3 శాతం వరకు డిస్కౌంట్ ఆఫర్‌ను పొందనున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు.
దిల్లీలోని భారత్ మండపంలో మంగళవారం కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సొసైటీ ఆఫ్ ఇండియమ్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్(సియామ్) సీఈవోలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మొబైల్ ఇండస్ట్రీకి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ క్రమంలో కొత్త వాహనాలపై డిస్కౌంట్లు అందజేసేందుకు కంపెనీల ప్రతినిధులు అంగీకరించినట్లు గడ్కరీ తెలిపారు.
అంటే పాత వాహనాలను తుక్కు కింద ఇచ్చేసి 'సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్'ను తీసుకొచ్చిన వినియోగదారులకు కొత్త కార్లపై ఎక్స్ షోరూం ధరపై 1.5శాతం లేదా రూ.20వేలు ఏది తక్కవైతే అది అందజేస్తారు. ఇక అశోక్ లే లాండ్, మహీంద్రా & మహీంద్రా, టాటా మోటార్స్, ఫోర్స్ వంటి కమర్షియల్ వెహికల్స్ తయారీ సంస్థలు 3.5 టన్నుల కంటే ఎక్కువ సామర్థ్యం కలిగిన రవాణా వాహనాల ఎక్స్ షోరూం ధరపై 3 శాతం వరకు డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు ప్రకటించాయి.
📍𝑩𝒉𝒂𝒓𝒂𝒕 𝑴𝒂𝒏𝒅𝒂𝒑𝒂𝒎, 𝑵𝒆𝒘 𝑫𝒆𝒍𝒉𝒊
— Nitin Gadkari (@nitin_gadkari) August 27, 2024
Chaired a highly productive session of the SIAM CEO’s Delegation Meeting at Bharat Mandapam today, where we addressed various critical issues facing the automobile industry.
I am pleased to report that, in response to my… pic.twitter.com/9n4aUdgoby
డిస్కౌంట్లు అందించేందుకు అంగీకరించి, వాహనాల ఆధునికీకరణ కార్యక్రమంలో భాగస్వాములైన వాహన తయారీ సంస్థలకు గడ్కరీ కృతజ్ఞతలు తెలిపారు. కాగా దేశంలో 1,000కి పైగా వెహికల్ స్క్రాపింగ్ కేంద్రాలు, 400లకు పైగా ఆడోమెటెడ్ ఫిట్నెస్ టెస్ సెంటర్లు అవసరమని గతేడాది నితిన్ గడ్కరీ పేర్కొన్న సంగతి తెలిసిందే. నేషనల్ వెహికల్ స్క్రాపింగ్ పాలసీ అనేది వాటాదారులందరికీ లాభదాయకంగా ఉంటుందని అన్నారు. దక్షిణాసియాలోనే అతిపెద్ద స్క్రాపింగ్ హబ్‌గా ఇండియా నిలువనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సర్క్యూలర్ ఎకానమీ అనేది కీలకమని, అది దేశంలో కొత్త ఉద్యోగాలను సృష్టిస్తుందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అన్నారు.
దిమ్మతిరిగే ఫీచర్లతో 'టీవీఎస్ జూపిటర్ 110'- ధర ఎంతంటే? - TVS Jupiter 110 Launched
ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా?- మార్కెట్లో టాప్-10 కార్లు ఇవే! - Best Cars in India