Microsoft Satya Nadella About AI : టెక్ కంపెనీలు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI)పై లోతైన పరిశోధనలు చేపడుతున్న నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఏఐను మనుష్యుల్లా ట్రీట్ చేయడం ఆపాలని సూచించారు.
ఏఐ మనిషి కాదు!
టెక్ కంపెనీలు అన్నీ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI), ఆర్టిఫీషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ (AGI) అభివృద్ధిపైనే దృష్టి సారిస్తున్నాయి. మనుష్యుల్లా నవ్వడం, పాడడం, అనుకరించడం సహా, వివిధ గొంతుకలతో మాట్లాడగలిగేలా ఏఐని అభివృద్ధి చేస్తున్నారు. చివరకు మనుష్యుల్లా ఆలోచించే మర మనుషులను తయారు చేయాలని తపిస్తున్నారు. అయితే, ఈ తరహా ప్రయోగాలపై మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ను మనుషుల్లా భావించడం పూర్తిగా ఆపాలని సూచించారు.
ఏఐలో మనుష్యుల తరహా లక్షణాలు తీసుకురావాలనే ఆలోచన సరికాదని సత్యన నాదెళ్ల అభిప్రాయపడ్డారు. కృత్రిమ మేధను కేవలం ఒక సాధనంగా మాత్రమే ట్రీట్ చేయాలని సూచించారు. మానుషులకు ఉపయోగించే నామవాచకాలు (పేర్లు), సర్వనామాలు ఏఐకు వాడకూడదని పేర్కొన్నారు.
'మనుషులకు మాత్రమే ఇంటెలిజెన్స్ ఉంటుంది. దానిని ఆర్టిఫీషియల్‌గా పొందాల్సిన అవసరం లేదు' అని సత్య నాదెళ్ల వ్యాఖ్యానించారు.
అసలు అలా పిలవడమే కర్టెక్ట్ కాదు!
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అనే పదమే సరిగ్గా లేదని సత్య నాదెళ్ల అన్నారు. దీనిని 'డిఫరెంట్ ఇంటెలిజెన్స్' అని వ్యవహరించి ఉండే బాగుండేదని అభిప్రాయపడ్డారు.
కృత్రిమ మేధ (ఏఐ)తో పూర్తిగా వాణిజ్యపరమైన సంబంధం మాత్రమే ఉండాలని సత్య నాదెళ్ల సూచించారు. అవసరమైనప్పుడు సేవలందించే సాధనంగా మాత్రమే ఏఐ ఉండాలని అన్నారు. మనుషుల మధ్య బంధాన్ని రీప్లేస్ చేసేలా కృత్రిమ మేధ ఉండకూడదని స్పష్టం చేశారు.
'పెద్ద జీతంతో ఉద్యోగం రావాలంటే - ఏఐ నైపుణ్యాలు పెంచుకోవాల్సిందే'
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI)తో ఉద్యోగాలు పోతాయని కొందరు వాదిస్తుంటే, మరికొందరు మాత్రం ఇది కొత్త అవకాశాలు సృష్టిస్తుందని చెబుతున్నారు. ఏఐ నైపుణ్యాలు అందిపుచ్చుకుంటే, మంచి ఉద్యోగ అవకాశాలు, భారీ జీతాలు అందుకోవచ్చని సూచిస్తున్నారు. దిగ్గజ దేశీయ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ సీటీఓ రఫీ తరఫ్దార్ కూడా ఇదే విషయాన్ని నొక్కి చెబుతున్నారు.
కృత్రిమ మేధ (ఏఐ)ను సమర్థవంతంగా అర్థం చేసుకోగలిగిన వారి భవిష్యత్ చాలా బాగుంటుందని రఫీ తరఫ్దార్ అభిప్రాయపడ్డారు. ప్రధానంగా ఉద్యోగ ప్రపంచంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధంగా ఉన్న యువ ఇంజినీర్లు ఏఐ టూల్స్‌పై అవగాహన పెంచుకోవడం చాలా అవసరమని ఆయన సూచించారు.
రూ.15వేల బడ్జెట్లో మంచి స్మార్ట్‌ఫోన్ కొనాలా? టాప్-10 ఆప్షన్స్ ఇవే! - Best Mobile Phones Under 15000