Scorpio Classic Boss Edition: స్కార్పియో లవర్స్‌కు గుడ్‌న్యూస్. మార్కెట్లోకి మహీంద్రా అండ్ మహీంద్రా తన స్కార్పియో క్లాసిక్ బాస్ ఎడిషన్‌ను విడుదల చేసింది. దీని పాత వెర్షన్స్‌కు సరికొత్త అప్డేట్స్ చేస్తూ అదిరే ఫీచర్లతో దీన్ని రూపొందించారు. అయితే ఈ ఎడిషన్ కేవలం ఈ పండగ సీజన్లో మాత్రమే మార్కెట్లో అందుబాటులో ఉంటుందని సమాచారం. ఈ సందర్భంగా దీని ధర, స్పెసిఫికేషన్లపై మరిన్ని వివరాలు మీకోసం.
దీని స్పెషాలిటీ?: దీని పాత వెర్షన్‌ను అప్డేట్ చేస్తూ అదిరే ఫీచర్లతో దీన్ని తీసుకొచ్చారు. ఈ SUV వెనుక పార్కింగ్ కెమెరా ఉంది. ఇది టైట్ పార్కింగ్ ప్రదేశాలలో వాహనాన్ని నడిపించడంలో సహాయపడుతుంది. అప్హోలిస్టరీని బ్లాక్ కలర్లోకి మార్చారు. దీని డ్యాష్‌బోర్డ్ ఇప్పటికీ డ్యూయల్-టోన్ బ్లాక్, లేత గోధుమరంగు కాంబినేషన్లోనే ఉంది. వీటితోపాటు ఈ ఎడిషన్ పిల్లో, కుషన్స్ ఉన్న మహీంద్రా కంఫర్ట్ కిట్‌తో వస్తుంది.
ఇంజిన్ పవర్, గేర్‌బాక్స్: ఈ కొత్త మహీంద్రా స్కార్పియో క్లాసిక్ బాస్ ఎడిషన్ 2.2-లీటర్ mHawk డీజిల్ ఇంజిన్‌తో వస్తుంది. ఈ ఇంజన్ 3,750 rpm వద్ద గరిష్టంగా 130 bhp శక్తిని, 1,600-2,800 rpm వద్ద 300 Nm గరిష్ట టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఇది 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో కనెక్ట్ చేసి ఉంటుంది. కానీ మీరు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, 4x4 డ్రైవ్‌ట్రెయిన్ పొందలేరు.
Daring, dark, and boldly unstoppable. The Scorpio Classic Boss Edition is here to own every road.
— Mahindra Scorpio (@MahindraScorpio) October 17, 2024
This special edition features Dark chrome-themed exteriors, Boss Black interiors, a rear-view camera, a classic black chrome front grille, and much more.
Available via accessories… pic.twitter.com/bpNsifoq2L
డిజైన్: ఈ కొత్త మహీంద్రా స్కార్పియో క్లాసిక్ బాస్ ఎడిషన్ బానెట్ స్కూప్, ఫ్రంట్ గ్రిల్, ఫాగ్ ల్యాంప్స్, రియర్ రిఫ్లెక్టర్స్, టెయిల్ ల్యాంప్స్, డోర్ హ్యాండిల్స్, సైడ్ ఇండికేటర్లపై డార్క్ క్రోమ్ గార్నిష్‌ను కలిగి ఉంది. వెనక క్వార్టర్ గ్లాస్, హెడ్‌ల్యాంప్స్ ఉన్నాయి. ఫ్రంట్ బంపర్, రెయిన్ వైజర్, ORVM కోసం యాడ్-ఆన్ కార్బన్ ఫైబర్ కవర్ కూడా ఉంది. దీనికి బ్లాక్ పౌడర్ కోటింగ్‌తో రియర్ గార్డును కూడా అమర్చారు.
కలర్ ఆప్షన్స్: ఈ కొత్త SUV ఐదు కలర్ ఆప్షన్లతో వస్తుంది.
- గెలాక్సీ గ్రే
- డైమండ్ వైట్
- స్టెల్త్ బ్లాక్
- ఎవరెస్ట్ వైట్
- రెడ్ రేజ్
వేరియంట్స్: మహీంద్రా స్కార్పియో క్లాసిక్ రెండు వేరియంట్స్‌లో లభిస్తుంది.
- ఎస్
- ఎస్11
ధర:
వీటి ధర మార్కెట్లో రూ.13.62 లక్షల నుంచి ప్రారంభమై రూ.17.42 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.