Laptop Under 15000 : ఈ కాలంలో ల్యాప్‌టాప్ కొనాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అందులోనూ మంచి ల్యాప్‌టాప్ కావాలంటే రూ.50వేలైనా ఉండాలి. ఫీచర్లు పెరిగే కొద్దీ రేట్లూ పెరుగుతాయి. కానీ, భారత్‌లో ఒక కంపెనీకి చెందిన ల్యాప్‌టాప్ అతి తక్కువ ధరకే అదిరిపోయే ఫీచర్లతో అందుబాటులో ఉంది. ఆ ధర, ఫీచర్లు చూస్తుంటే వెంటనే కొనేయాలనిపిస్తుంది. ఇంతకీ అది ఏ కంపెనీ ల్యాప్‌టాప్? ఫీచర్ల సంగతేంటి అని తెలుసుకోవాలని ఉందా? ఇంకెందుకు ఆలస్యం తెలుసుకుందాం పదండి.
రిలయన్స్ కంపెనీలో భాగమైన జియో ఇండియన్ టెలికాం ప్రస్తుతం ఎలక్ట్రానిక్ రంగంలో ఓ సంచలనం. ప్రస్తుత రోజుల్లో డేటా అత్యంత తక్కువ ధరలో అందుబాటులో ఉందంటే దానికి కారణం ఒక రకంగా ఈ కంపెనీయే అని చెప్పవచ్చు. డేటా దగ్గర్నుంచి ఫోన్ల వరకు ఎన్నో సంస్కరణల్ని తీసుకొచ్చింది రిలయన్స్ ఇండస్ట్రీస్. తాజాగా మరో సంచలనానికి తెర తీసింది. అతి తక్కువ ధరకే సామాన్యులకూ సైతం అందుబాటులో ఉండేలా అద్భుతమైన ఫీచర్లతో ఓ ల్యాప్‌టాప్‌ను ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసింది.
జియో ల్యాప్‌టాప్ ఫీచర్లివే
రిలయన్స్ జియో తీసుకువచ్చిన ఆ ల్యాప్‌టాప్ పేరు 'Jio Book 4G'. గతేడాది జరిగిన ఇండియా మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసీ) ప్రదర్శనలో ఈ సూపర్ అఫర్డబుల్ ల్యాప్‌టాప్‌ను రిలీజ్ చేశారు. యాంటీ-గ్లేర్ హెచ్డీ స్క్రీన్ కలిగిన 11.6 అంగుళాలతో మంచి కాంపాక్ట్ సైజులో వస్తుందీ ల్యాప్‌టాప్. ఇది 100జీబీ క్లౌడ్ స్టోరేజీతో వస్తుంది. అంతేకాకుండా చూడటానికి చాలా స్లిమ్‌గానూ ఉంది. మీడియాటెక్ ఆక్టా-కోర్ చిప్సెట్ ప్రాసెసర్‌తో రన్ అవుతుంది.
Wi-Fiతో పనిలేదు
రిలయన్స్ జియో అభివృద్ధి చేసిన జియో ఆపరేటింగ్ సిస్టమ్‌పై 'జియో బుక్ 4జీ' నడుస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 8 గంటల వరకు గ్యాప్ లేకుండా వాడుకోవచ్చు. మీరు ఈ JioBookలో ఎడ్యుకేషనల్ ఛానళ్ల కోసం JioTVని కూడా చూడవచ్చు. గేమ్స్ లవర్స్ కోసం ప్రత్యేకంగా JioGames ఆప్షన్‌ను కూడా తీసుకువచ్చారు. క్లౌడ్ గేమింగ్ ద్వారా దీనిని యాక్సెస్ చేసుకోవచ్చు. 4G సపోర్ట్‌తో వస్తున్న ఈ జియో బుక్‌ను వై-ఫై నెట్‌వర్క్‌కి కనెక్ట్ చేయాల్సిన అవసరమే లేదు.
విద్యార్థులకు బెస్ట్ ఛాయిస్!
ఇన్ని అద్భుతమైన ఫీచర్లున్న ఈ Jio Book 4G ల్యాప్‌టాప్ ధర రూ.14,701 మాత్రమే. ఆన్లైన్ ఇ-కామర్స్ స్టోర్ అమెజాన్‌లో ఇది అందుబాటులో ఉంది. ఏడాది పాటు Quick Heal సబ్స్క్రిప్షన్, Digi Boxx నుంచి 100GB క్లౌడ్ స్టోరేజ్‌తో ఈ ల్యాప్‌టాప్ వస్తుంది. కాగా, రిలయన్స్ దీనిని India's First Learning Bookగా అభివర్ణిస్తుంది. ఇక అతి తక్కువ ధరలో ల్యాప్‌టాప్ కొనాలనుకునే వారికి, విద్యార్థులకు జియో బుక్ 4జీని బెస్ట్ ఆప్షన్‌గా చెప్పవచ్చు. కోడింగ్, డాక్యుమెంటేషన్, ప్రెజంటేషన్స్, మెయిల్స్, చదువు పరంగా అద్భుతంగా ఉపయోగపడుతుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
రూ.15,000 బడ్జెట్లో మంచి స్మార్ట్‌ఫోన్ కొనాలా? టాప్-10 ఆప్షన్స్ ఇవే!
ట్రూకాలర్ నయా కాల్ రికార్డింగ్ ఫీచర్ - రియల్ టైమ్‌లో ట్రాన్స్క్రిప్షన్, కాల్ సమ్మరీ