Jio Number Re-verification : మీరు ఇతరుల ఆధార్ కార్డ్ ఉపయోగించి జియో సిమ్ తీసుకున్నారా? అయితే ఇది మీ కోసమే. ఇతరుల ఐడెంటిటీ ప్రూఫ్‌తో రిలయన్స్ జియో సిమ్ తీసుకుని వాడుతున్న వారందరూ కచ్చితంగా గడువులోగా రీ-వెరిఫికేషన్ చేసుకోవాలి. లేకుంటే మీరు వాడుతున్న సిమ్ కార్డ్‌ను బ్లాక్ చేసే అవకాశం ఉంది.
రిలయన్స్ జియో ఇప్పటికే తమ యూజర్లకు రీ-వెరిఫికేషన్ చేసుకోమని టెక్ట్స్ మెసేజ్‌లు, కాల్స్ చేస్తోంది. ఒకవేళ మీకు కూడా ఇలాంటి సందేశమే వస్తే, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా, మీ నంబర్‌ను రీ-వెరిఫికేషన్ చేసుకోవడం మంచిది. ఇది ఆప్షనల్ కాదు. గవర్నమెంట్ గైడ్‌లైన్స్ ప్రకారం ఇది తప్పనిసరి.
Jio Number Re-verification Process
- ముందుగా మీరు My Jio యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి.
- యాప్‌లో మీ జియో నంబర్‌తో లాగిన్ కావాలి.
- అప్పుడు యాప్‌లోని సర్వీస్‌లు అన్నీ మీకు కనిపిస్తాయి.
(అక్కడ Re-verification pending! Please re-verify connection to avoid suspension of service అని కనిపిస్తుంది. ఇలా మీకు కూడా కనిపిస్తే, వెంటనే రీ-వెరిఫై చేసుకోవాలి.)
- ఇందుకోసం మీరు Re-verify now బటన్‌పై క్లిక్ చేయాలి.
(అక్కడ మీరు ఎందుకు మీ జియో నంబర్‌ను రీ-వెరిఫై చేసుకోవాలో జియో వివరిస్తుంది. దీనిని చదివిన తరువాత మీ ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేసి వ్యాలిడేట్ చేసుకోవాలి. లేదా ఓటర్ ఐడీ, పాస్‌పోర్ట్ లాంటి ఇతర ప్రభుత్వ గుర్తింపు పత్రాలను సైతం అప్లోడ్ చేయవచ్చు. )
- మీరు కనుక ఆధార్‌తో వెరిఫై చేసుకోవాలని అనుకుంటే, ఆధార్కార్డ్పై క్లిక్ చేసి, జనరేట్ ఓటీపీపై క్లిక్ చేయాలి.
- వెంటనే మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్ చేయాలి.
- తరువాత మీరు ఫోన్ కెమెరాను ఓపెన్ చేసి, మీ ఫొటో తీసుకోవాలి. ఆ ఫొటో కచ్చితంగా చాలా క్లియర్‌గా ఉండేలా చూసుకోవాలి. అప్పుడే అది మీ ఆధార్ కార్డ్‌లో ఉన్న ఫొటోతో సరిపోలుతుంది.
(ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, మీరు వేరే ఫోటోను అప్లోడ్ చేయలేరు. కేవలం కెమెరా ద్వారా రియల్‌టైమ్‌లో ఫోటో తీసుకోవాల్సి ఉంటుంది.)
- తరువాత మీరు సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయాలి. అంతే సింపుల్!
- మీ జియో నంబర్ రీ-వెరిఫికేషన్ ప్రాసెస్ ప్రారంభమవుతుంది. దీనికి ప్రూఫ్‌గా మీకు ఒక ఎస్ఎంఎస్ వస్తుంది. దానిలో టికెట్ ఐడీ ఉంటుంది.
- మీ జియో నంబర్ రీ-వెరిఫికేషన్ పూర్తి కావడానికి సుమారుగా 7-8 గంటలు పడుతుంది. రీ-వెరిఫికేషన్ పూర్తైన తరువాత ఆ విషయం మీకు మెసేజ్ రూపంలో వస్తుంది.
బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్ - మే 1 నుంచి మారనున్న రూల్స్ ఇవే! - New Bank Rules From May 1st 2024