ETV Bharat / technology

మూడ్​కు తగ్గట్టుగా 'ప్రొఫైల్ సాంగ్'​ - ఇన్​స్టా లేటెస్ట్ ఫీచర్​ - ఎలా సెట్ చేయాలంటే? - INSTAGRAM SONG ON PROFILE FEATURE

Instagram Introduces Song On Profile Feature : ఇన్​స్టాగ్రామ్ యూజర్లకు గుడ్ న్యూస్​. ఇకపై మీరు మీ మూడ్‌కు తగ్గట్లుగా సాంగ్‌ను ప్రొఫైల్‌కు యాడ్‌ చేసుకునే ఫీచర్‌ను ఇన్‌స్టాగ్రామ్‌ ప్రవేశపెట్టింది.

Instagram
Instagram (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 23, 2024, 5:20 PM IST

Instagram Introduces Song On Profile Feature : ఇన్‌స్టాగ్రామ్‌ డైహార్డ్​ ఫాన్స్​కు గుడ్ న్యూస్​. ఇన్​స్టాగ్రామ్ మీ కోసం మరో సరికొత్త ఫీచర్‌ను తీసుకువచ్చింది. ప్రొఫైల్‌ కస్టమైజేషన్‌ను మరింత మెరుగుపర్చడంలో భాగంగా 'ప్రొఫైల్‌ సాంగ్‌' (Insta Profile Song) ఫీచర్​ను ప్రవేశపెట్టింది. పేరులో ఉన్నట్లుగానే యూజర్లు తమ ప్రొఫైల్‌కు ప్రత్యేకంగా తమకు నచ్చిన పాటను పెట్టుకోవచ్చు. మూడ్‌కు అనుగుణంగా దాన్ని ఎంచుకునే వెసులుబాటు ఉంటుంది. ఇందుకోసం కొన్ని లైసెన్స్‌డ్‌ సాంగ్స్‌ను ఇన్‌స్టాగ్రామ్ అందుబాటులో ఉంచింది. దీని కోసం అమెరికాకు చెందిన ప్రముఖ గాయని సబ్రీనా కార్పెంటర్‌తో ఒప్పందం కూడా చేసుకుంది.

Instagram Profile Song Feature : యూజర్‌ బయో కింద ప్రొఫైల్‌ సాంగ్‌ ఫీచర్‌ కనిపిస్తుంది. మీరు మ్యూజిక్‌ ఐకాన్​ను ట్యాప్‌ చేస్తేనే పాట ప్లే అవుతుంది. అయితే యూజర్లు కేవలం 30 సెకన్ల నిడివి ఉన్న పాటను మాత్రమే ఎంచుకునే అవకాశం ఉంటుంది. యూజర్లు మార్పు చేసే వరకు ప్రొఫైల్‌లో ఆ సాంగ్‌ మాత్రమే ఉంటుంది. అంటే స్టేటస్‌/ స్టోరీస్‌ తరహాలో 24 గంటల్లో అది మాయం అవ్వదు.

ప్రొఫైల్‌ సాంగ్​ను ఎలా యాడ్ చేయాలంటే?

  • ముందుగా మీరు ఇన్‌స్టా ప్రొఫైల్‌ ట్యాబ్‌లోకి వెళ్లి 'ఎడిట్‌ ప్రొఫైల్‌'ను ఎంచుకోవాలి.
  • 'యాడ్‌ మ్యూజిక్‌ టు యువర్‌ ప్రొఫైల్‌'పై క్లిక్‌ చేయాలి.
  • మీకు నచ్చిన పాటలో - క్లిప్‌ నిడివిని ఎంచుకోవాలి.
  • ఒక పాటలో గరిష్ఠంగా 30 సెకన్ల వరకు ఎంచుకుని, దానిని ప్రొఫైల్​ సాంగ్​గా పెట్టుకోవచ్చు. అంతే సింపుల్​!

ఇన్​స్టా ఇన్​ఫ్లుయెన్సర్స్​ వాడే టాప్​-10 ఎడిటింగ్ యాప్స్​​ ఇవే!
మనలో చాలా మందికి ఇన్​స్టాగ్రామ్ ఇన్​ఫ్లూయెన్సర్ కావాలని ఉంటుంది. ఇందుకోసం చాలా సాఫ్ట్​వేర్లు వాడుతూ ఉంటారు. అందుకే ఈ ఆర్టికల్​లో చాలా పాపులర్ ఇన్​ఫ్లూయెన్సర్లు వాడే టాప్​-10 ఎడిటింగ్ యాప్స్ గురించి తెలుసుకుందాం.​

1. Canva : ప్రస్తుతం అత్యంత ప్రజాదరణ పొందిన ఫొటో ఎడిటింగ్ యాప్​లో కాన్వా ఒకటి. దీని ఇంటర్​ఫేస్, బాగుంటుంది. సోషల్ మీడియా, ప్రెజెంటేషన్స్, పోస్టర్స్, బిజినెస్ కార్డ్స్ వంటి వాటిని గ్రాఫికల్​గా, రిచ్​గా చేయడానికి కాన్వా ఉపయోగపడుతుంది. ఇందులో ఫొటో ఎడిటింగ్ చేయడానికి అధునాతన ఫొటో, వీడియో ఎడిటింగ్​పై నైపుణ్యాలు ఉండాల్సిన అవసరం లేదు.

2. VSCO : వీఎస్​సీఓ అనేది ఫొటోగ్రఫీ, ఫొటో ఎడిటింగ్ కోసం ఉపయోగించే ఒక మొబైల్ యాప్. ఇది ఫొటో బ్రైట్​నెస్, క్రాప్, ప్రీసెట్ ఫిల్టర్లను చేసే సాధనంగా ఉపయోగపడుతుంది. దీని పెయిడ్ వెర్షన్ కూడా ఉంది.

3. A Color Story : కలర్ స్టోరీ ఫొటో ఎడిటింగ్ యాప్​ను చాలా ఈజీగా ఉపయోగించవచ్చు. దీంట్లో వినియోగదారులు ప్రీసెట్ ఫిల్టర్లను అప్లై చేయవచ్చు. ఈ యాప్ మూవబుల్ ఎఫెక్ట్స్, బేసిక్ ఎడిటింగ్ టూల్స్​ను అందిస్తుంది. పూర్తి స్టోరీ కోసం ఈ లింక్​పై క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.